Advertisementt

స్నేక్‌ ఛాలెంజ్‌ ని తమన్నా ఇరగదీసింది..!

Thu 17th May 2018 03:25 PM
tamannah,dj snake,challenge  స్నేక్‌ ఛాలెంజ్‌ ని తమన్నా ఇరగదీసింది..!
DJ Snake - Magenta Riddim Dance By Tamanna Bhatia స్నేక్‌ ఛాలెంజ్‌ ని తమన్నా ఇరగదీసింది..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలలో అద్భుతమైన డ్యాన్సర్‌ ఎవరంటే అందరు మిల్కీబ్యూటీ తమన్నా పేరు చెబుతారు. ఈ తరంలో నాకు తమన్నాతో కలిసి స్టెప్పులు వేయాలని ఉందని మెగాస్టార్‌ చిరంజీవి సైతం చెప్పాడు. ఇక 'రచ్చ'లో రామ్‌చరణ్‌తో సత్తా చాటిన ఆమె తాజాగా వచ్చిన ఎన్టీఆర్‌ 'జైలవకుశ'తో పాటు బెల్లకొండ సాయిశ్రీనివాస్‌ నటించిన చిత్రాలలో కూడా తన డ్యాన్స్‌తో మెప్పించింది. 

ఇక ప్రస్తుతం ఆమె 'సైరా, నానువ్వే, క్వీన్‌' వెంకటేష్‌ సరసన 'ఎఫ్‌2' చిత్రాలలో నటిస్తోంది. 

ఇక విషయానికి వస్తే ఈ 'అవంతిక'కు పారిస్‌కి చెందిన డీజే స్నేక్‌ ఛాలెంజ్‌ విసిరాడు. తాను నటించిన 'మెజ్జెంటా రిట్టమ్‌' పాటకు డ్యాన్స్‌ చేయాలని చేసిన చాలెంజ్‌ని తమన్నా స్వీకరించడమే కాకుండా అందులో నెగ్గి కూడా చూపించింది. వెస్ట్రన్‌,ఇండియన్‌ స్టైల్‌లోసాగిన తమన్నా స్టెప్పులు చూసి నెజిజన్లు కూడా ఫిదా అయ్యారు. ఇక డీజె స్నేక్‌ కూడా ఇందులో తమన్నా స్టెప్స్‌ కూడా ఆశ్చర్యపోయాడు. 

డీజే స్నేక్‌ కోసం 'మెజ్జెంటా రిట్టమ్‌'కి ఒప్పుకున్నా కూడా ఆ పాటకు జూయివైద్యా స్టెప్స్‌లకు డ్యాన్స్‌ కొరియోగ్రఫీ అందించారని, అనే క్యాప్షన్‌ని ఇచ్చారు. ఈ వీడియోను లక్ష మంది లైక్‌ చేయడం విశేషం.ఈ పాట ఇండియాలో కూడా బాగా పాపులర్‌ అయింది. ఈపాటను కంపోజ్‌ చేసేందుకు స్నేక్‌ ఇండియా వచ్చారు. ఈ పాటకు డ్యాన్స్‌ చేసిన వారిలో ఎక్కువ మంది భారతీయులే కావడం విశేషం. 

Click Here To See The Tamanna Challenge

DJ Snake - Magenta Riddim Dance By Tamanna Bhatia:

Tamannah Wins DJ Snake Challenge

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ