Advertisementt

ఎన్టీఆర్‌కి 'అ' సెంటిమెంట్‌ వద్దంటున్నారు!

Thu 17th May 2018 03:11 PM
jr ntr,trivikram srinivas,asamanyudu,agnathavasi,fans  ఎన్టీఆర్‌కి 'అ' సెంటిమెంట్‌ వద్దంటున్నారు!
Fans Suggestions to NTR And Trivikram Movie Title ఎన్టీఆర్‌కి 'అ' సెంటిమెంట్‌ వద్దంటున్నారు!
Advertisement
Ads by CJ

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన చిత్రాలలో 'అతడు. అ..ఆ, అజ్ఞాతవాసి' వంటి చిత్రాలు 'అ' సెంటిమెంట్‌తో టైటిల్‌ని కలిగి ఉన్నాయి. 'అతడు, అ..ఆ' ఫర్వాలేదనిపించినా 'అజ్ఞాతవాసి' మాత్రం భారీ తేడా కొట్టింది. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ హారిక అండ్‌ హసిని బేనర్‌పైనే రాధాకృష్ణ నిర్మాతగా ఎన్టీఆర్‌ హీరోగా ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యాక్షన్‌, యాక్షన్‌, ఎమోషన్స్‌, సెంటిమెంట్‌ వంటి నవరసాలతో రూపొందుతోందని సమాచారం. 

ఇక ఇందులో ఎన్టీఆర్‌ సరసన 'డిజె' భామ జిగేల్‌రాణి పూజాహెగ్డే నటిస్తోంది. 'ముకుందా, ఒక లైలా కోసం' వంటి ఫ్లాప్స్‌ తర్వాత బాలీవుడ్‌లో మొహంజదారో వంటి డిజాస్టర్‌ తర్వాత 'డిజె'లో బికినీ ద్వారా అందరినీ ఆకట్టుకుని, 'డిజె'లో హీరోయిన్‌గా, 'రంగస్థలం'లో 'జిగేల్‌రాణి' అంటూ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించిన పూజాహెగ్డే ప్రస్తుతం బెల్లకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా శ్రీవాసు దర్శకత్వంలో రూపొందుతున్న 'సాక్ష్యం'తో పాటు ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ చిత్రం, దిల్‌రాజు, అశ్వనీదత్‌, వంశీపైడిపల్లిలు మహేష్‌తో చేయబోయే 25వ మూవీ, ఆ తర్వాత ప్రభాస్‌ జిల్‌ రాధాకృష్ణ ఫేమ్‌తో చేసే చిత్రాలలో హీరోయిన్‌గా నటిస్తోంది. 

ఇక ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ చిత్రానికి 'అసామాన్యుడు' అనే టైటిల్‌ వార్తల్లోకి వచ్చింది. అయితే ఈ టైటిల్‌ బాగా లేదని, అందునా 'అజ్ఞాతవాసి' తర్వాత 'అ' సెంటిమెంట్‌ వద్దని, మరో టైటిల్‌ని ఖరారు చేయమని నందమూరి ఫ్యాన్స్‌ నుంచి ఒత్తిడి వస్తోందట . ఇక ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయనున్నారని తెలుస్తోంది. 

ఇక 'అత్తారింటికిదారేది'లో నదియా, 'సన్నాఫ్‌ సత్యమూర్తి'లో స్నేహ, 'అజ్ఞాతవాసి'లో ఖుష్బూల చేత కీలక పాత్రలు చేయించిన త్రివిక్రమ్‌ ఎన్టీఆర్‌ చిత్రంలో రంభని తీసుకోనున్నాడని సమాచారం. ఇది చిత్రంలో ఎంతో కీలకమైన పాత్ర అని తెలుస్తోంది. లయ నుంచి పలువురిని పరిశీలించిన తర్వాత రంభని ఈ పాత్రకి ఫైనల్‌ చేశారట. ఇక ఆ ఎప్పుడో వచ్చిన 'నాగ', 'యమదొంగ' చిత్రాలలో రంభ, ఎన్టీఆర్‌తో కలిసి చిందులు వేసిన సంగతి తెలిసిందే. 

Fans Suggestions to NTR And Trivikram Movie Title:

Fans Reaction on Asamanyudu Title

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ