Advertisementt

'సై రా'.. నిరాశ తప్పదా..?

Thu 17th May 2018 02:35 PM
sye raa,sye raa narasimha reddy,chiranjeevi,break,rest  'సై రా'.. నిరాశ తప్పదా..?
Chiru takes a break from Sye Raa Narasimha Reddy 'సై రా'.. నిరాశ తప్పదా..?
Advertisement
Ads by CJ

చిరంజీవి - సురేందర్ రెడ్డి - రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న సై రా నరసింహారెడ్డి షూటింగ్ స్పీడు బ్రేకర్లు ఎదురొస్తే.. బ్రేకులు పడినట్లుగా బ్రేకులు పడుతుంది.  భారీ బడ్జెట్ తో దేశంలోని పలు భాషల్లో తెరకెక్కుతున్న సై రా నరసింహారెడ్డి సినిమాపై ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ వర్గాల్లోనూ మంచి అంచనాలేకాదు.. భారీ క్రేజ్ కూడా ఉంది. అయితే గత ఏడాది డిసెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ తో సెట్స్ మీదకెళ్ళిన సై రా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ అనుకున్నంత సాఫీగా సాగడం లేదు. దీనికి ముఖ్యకారణం చిరంజీవి అనే రూమర్ సోషల్ మీడియాలో ఉంది. సై రా నరసింహారెడ్డి సినిమాని ఈ ఏడాది చివరికల్లా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు.

మరి మేకర్స్ ఎంతగా సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని పాకులాడుతున్నప్పటికీ.. సినిమా షూటింగ్ అంత ఆలస్యమవుతుందని.. భారీ చారిత్రక నేపథ్యం ఉయ్యాలవాడ కథతో తెరకెక్కుతున్న సై రా సినిమా కోసం చిరంజీవి విపరీతంగా కష్టపడాల్సి వస్తుందని అంటున్నారు. మరి 60  ఏళ్ళు పైబడిన చిరంజీవి.. అలా కత్తులు కటార్లు తిప్పుతూ.. శారీరకముగాను, మానసికంగానూ చిరంజీవి బాగా అలిసిపోవడం వలనే.. షెడ్యూల్‌కీ షెడ్యూల్‌కీ మధ్య పెద్ద గ్యాప్ ఏర్పడుతోందని.. అందుకే షూటింగ్ కి గ్యాప్ ఇవ్వాల్సి వస్తుందంటున్నారు. ఆయన అలా అలసిపోవడం వలన ఎక్కువ విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుందట.

అందుకే అనుకున్న టైం కి సై రా షెడ్యూల్ కంప్లీట్ కావడం లేదనే టాక్ వినబడుతుంది. మరి ఇలా షూటింగ్ కి భారీ గ్యాప్ ఇచ్చేస్తుంటే.... ఈ సినిమాలో చాలామంది ఇతర భాషలనుండి ప్రముఖ నటులు నటిస్తుండడం.. వారి డేట్స్ అడ్జెస్ట్ చెయ్యడం ఇలాంటి విషయంలో నిర్మాత రామ్ చరణ్ నలిగిపోతున్నాడనే  టాక్ గట్టిగానే వినబడుతుంది. మరి ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా సై రా నుండి తప్పుకుని నెలలు గడుస్తున్నప్పటికీ.. ఇంతవరకు సై రా కి మ్యూజిక్ డైరెక్టర్ ని సెట్ చెయ్యలేకపోయింది సై రా టీమ్. మరి ఈ రకంగా నత్తనడకన సై రా షూటింగ్ సాగితే... సంక్రాంతికి వచ్చే సై రా కాస్తా సమ్మర్ కి వెళ్లినా ఆశ్చర్యపోవక్కర్లేదంటున్నారు. మరి మెగా ఫాన్స్ కి సై రాతో మెగా వెయిటింగ్ తప్పేలా లేదంటున్నారు.

Chiru takes a break from Sye Raa Narasimha Reddy:

Sye Raa Narasimha Reddy Gets Unexpected Break

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ