Advertisementt

బాలయ్య మైండ్ ని మహానటి మార్చేసింది!

Thu 17th May 2018 08:21 AM
director teja,ntr,ntr biopic,balakrishna,mahanati  బాలయ్య మైండ్ ని మహానటి మార్చేసింది!
Balakrishna Changed His Mind About NTR Biopic బాలయ్య మైండ్ ని మహానటి మార్చేసింది!
Advertisement
Ads by CJ

బాలకృష్ణ ఎంతో ప్రతిష్ట్మాకంగా చేపట్టిన ఎన్టీఆర్ బయోపిక్... తేజ డైరెక్షన్ ని వదిలేసి వెళ్లిపోవడంతో..అర్దాంతరంగా ఆగిపోయింది. రెండు మూడు రోజులు షూటింగ్ తో హడావిడి చేసిన బాలయ్య కూడా ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ ని పక్కన పెట్టేశాడనే న్యూస్ ప్రచారంలో ఉంది. ఎందుకంటే మహానటి సినిమాలో సావిత్రిగారి గురించిన విషయాలేమి దాచకుండా నాగ్ అశ్విన్ ప్రేక్షకుల ఎలా చూపిస్తే అర్ధమవుతుందో.. అలా చూపించి అందరి మెప్పుని పొందాడు. మరి ఎన్టీఆర్ జీవితంలో కూడా చాలా కాంట్రవర్సీలు, మోసాలు దాగున్నాయి. మహానటి వలే ఎన్టీఆర్ బయోపిక్ లో నిజానిజాలెలా చూపించాలో అనే విషయంలో బాలయ్య బాగా కన్ఫ్యూజ్ అవుతున్నాడని... అసలు ఎన్టీఆర్ జీవితంలో చీకటి కోణాన్ని బయటపెట్టేందుకు బాలయ్య మొగ్గు చూపడం లేదని... అసలు ఎన్టీఆర్ బయోపిక్ లో అవన్నీ చూపించాల్సి వస్తుందనే.. బాలయ్య ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ ని పక్కన పెట్టేశాడనే గుసగుసలు మొదలయ్యాయి.

మరి బయోపిక్ లకు కాలం కలిసొస్తుందా అనే అనుమానం మహానటి విడుదలకు ముందు అనేక మందిలో ఉంది. కానీ సినిమా విడుదలయ్యాక మహానటిని ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్న విధానం చూస్తుంటే.. బయోపిక్ ల శకం ఇప్పుడు మాములుగా ఉండదని.. అందుకే బాలకృష్ణ మళ్ళీ ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో పునరాలోచన చేస్తే బావుంటుందని.. అయితే ఎన్టీఆర్ గురించి బాగా రీసెర్చ్ చేసి ఈ సినిమాని పట్టాలెక్కించేందుకు రెడీ అయిన తేజానే మళ్ళీ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను నెత్తినెత్తుకుంటే బావుంటుందని ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారట. ఇక బాలయ్య కూడా మహానటి సినిమా చూసాక తన తండ్రి బయోపిక్ ని తెరమీదకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టాలని భావిస్తున్నాడట.

యంగ్ డైరెక్టర్, అసలు పెద్దగా అనుభవం లేని నాగ్ అశ్విన్ మహానటిని మెప్పించగా లేనిది మనం చేయలేమా అనే ఉద్దేశ్యంతో బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ మీద టీమ్ తో చర్చించి తేజని వెనక్కి రప్పించే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకోసం బాలయ్య తరుపున కొంతమంది తేజతో మధ్యవర్తిత్వం నడిపేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తుంది. అసలు మధ్యవర్తులెందుకు... బాలయ్య పిలిస్తే తేజ రాకపోడనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి బాలయ్యకి  తేజకి మధ్యలో ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలి.

Balakrishna Changed His Mind About NTR Biopic:

Director Teja Takeover the NTR Biopic Movie Again?|

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ