Advertisementt

శ్రీదేవికి మెహెందీ పెట్టింది గుర్తు చేసుకుంది..!

Thu 17th May 2018 08:17 AM
mehendi artist veena nagda,sridevi,sonam kapoor  శ్రీదేవికి మెహెందీ పెట్టింది గుర్తు చేసుకుంది..!
Mehendi Artist Veena Nagda Remember Sridevi శ్రీదేవికి మెహెందీ పెట్టింది గుర్తు చేసుకుంది..!
Advertisement
Ads by CJ

అతిలోకసుందరి శ్రీదేవితో తనకున్న అనుబంధాన్ని ప్రముఖ మెహెందీ నిపుణురాలు వీణా నగ్డా గుర్తు చేసుకున్నారు. ఇటీవల జరిగిన సోనమ్‌కపూర్‌ పెళ్లికి సైతం సోనమ్‌కపూర్‌కి, శ్రీదేవి కూతుర్లు జాన్వికపూర్‌, ఖుషీ కపూర్‌తోపాటు బోనీకపూర్‌ మొదటి భార్య కూతురు అన్షుల్లాకి సైతం వీణానే మెహెందీ పెట్టారు. ఇక ఈమె శ్రీదేవితో ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకుంటూ గత 20ఏళ్లుగా శ్రీదేవి ఫ్యామిలీలలో ఏ ఫంక్షన్‌ జరిగినా నేనే మెహెందీ పెట్టేదానిని.

సోనమ్‌ పెళ్లిలో అందరు నాచేత మెహెందీ పెట్టించుకున్నారు. కానీ శ్రీదేవి లేకపోవడం బాధాకరం. శ్రీదేవి లేదని నేనెంతో బాధపడ్డాను. ఆమెకి మెహెందీ పెట్టినరోజులు నాకు ఇప్పటికీ గుర్తే. ఆమె హఠాన్మరణం నాకు ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. శ్రీదేవికి నేను మెహెందీ పెట్టేటప్పుడు ఆమె పెద్ద కూతురు జాన్వి తనకి ఎప్పుడు మెహెందీ పెడతానా అని ఎదురుచూస్తూ కూర్చుని ఉండేది. జాన్వికి మూడేళ్ల వయసులోనే ఆమెకి మెహెందీ పెట్టాను. తనకి మెహెందీ అంటే చాలా ఇష్టం. 

శ్రీదేవికి పెళ్లయ్యాక మొదటి కర్వాచౌత్‌ పండుగ నాడు తొలిసారి ఆమెకి మెహెందీ పెట్టాను. కర్వాచౌత్‌ వస్తుందంటే చాలు మెహెందీ పెట్టించుకోవాలని శ్రీదేవి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేది. అలాంటిది ఆమె మరణించిందని తెలిసిన తర్వాత నమ్మలేకపోయాను. ఎవరో తప్పుడు వార్తలు సృష్టించారని భావించాను అంటూ ఉద్వేగానికిలోనవుతూ చెప్పుకొచ్చింది.

Mehendi Artist Veena Nagda Remember Sridevi:

I remember how excited Sridevi used to be to apply karwachauth Mehendi: Mehendi artist Veena Nagda

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ