'రంగస్థలం' సినిమాలో సమంత చేసిన రామలక్ష్మి పాత్ర ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మళ్లీ ఇప్పుడు అటువంటి పాత్రే మరోసారి చేయబోతుంది. అయితే ఈసారి తెలుగులో కాదు తమిళ్ లో శివ కార్తికేయన్ 'సీమ రాజా' అనే సినిమాలో అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రను చేస్తుంది.
'రంగస్థలం' తరహాలో కేరళలో పచ్చటి పొలాలు గ్రామాల నేపధ్యంలో దీని షూటింగ్ జరుగుతోంది. పొన్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రామలక్ష్మి పాత్రను మించిన అల్లరి సామ్ ఇందులో చేసిందని తెలిసింది. అంతేకాకుండా ఈ సినిమాలో మరో విషయం ఉంది. ఈ సినిమా కోసమే సిలంబం అనే గ్రామీణ యుద్ధ కళలో సమంతా శిక్షణ తీసుకుందట.
సాధారణంగా హీరోయిన్స్ పెళ్లికి ముందు ఎటువంటి పాత్రలు చేస్తుంటారు కానీ సామ్ మాత్రం ఇందుకు వ్యతిరేకం. పెళ్లయ్యాక సామ్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతుంది. ఇలా పెళ్లయ్యాక కూడా ఇంత భీభత్సమైన సోలో హీరోయిన్ కెరీర్ ఎంజాయ్ చేస్తున్న క్రెడిట్ ఒక్క సమంతాకే దక్కుతుంది. అప్పుడెప్పుడో సావిత్రి గారు అలా పెళ్లయ్యాక సినిమాలు చేసి హిట్స్ అందుకున్నారు. మళ్లీ ఇప్పుడు సమంత అలా హిట్స్ అందుకుంటుంది. మరి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసే ప్లాన్స్ అయితే కనబడటం లేదు. మరి ఇందులో సమంత ఉంది కాబట్టి ఆమెకోసం అన్న 'సీమ రాజా' సినిమాను తెలుగులోకి డబ్ చేస్తారేమో.