సీనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన బేనర్ అశ్వనీదత్‌కి చెందిన 'వైజయంతి మూవీస్'. ఇక ఈ బేనర్‌కి తెలుగునాట ఎంతో గుడ్ విల్ ఉంది. భారీ చిత్రాలను తెరకెక్కించడంతో, వారసులను పరిచయం చేయడంలో అశ్వనీదత్‌ది గోల్డెన్‌హ్యాండ్‌గా అందరు చెప్పుకుంటారు. ఇక నాడు ఎన్టీఆర్‌తో పాటు పలువురు స్టార్స్‌తో అత్యద్భుత చిత్రాలను తీసిన ఆయన చిరంజీవితో కూడా 'జగదేకవీరుడు అతిలోక సుందరి, ఇంద్ర' వంటి బ్లాక్‌బస్టర్స్ తీశాడు.
ఇక బాలయ్యతో 'అశ్వమేధం'తో పాటు నాగార్జున, వెంకటేష్‌లతో కూడా చిత్రాలు నిర్మించాడు. కానీ ఆయనకు చిరంజీవితో వచ్చిన హిట్స్ ఆ తర్వాత కాలంలో నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి వారితో రాలేదు. ఇక స్వప్న బేనర్ పతాకంపై ఈయన కూతుర్లు కూడా యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌తో 'స్టూడెంట్ నెంబర్ 1' నారారోహిత్‌ని పరిచయం చేస్తూ 'బాణం' వంటి చిత్రాలను నిర్మించారు. ఆ తర్వాత మాత్రం వారికి మహేష్‌బాబుతో తీసిన 'సైనికుడు', ఎన్టీఆర్‌తో తీసిన 'కంత్రీ, శక్తి' చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. దాంతో కొంత కాలంగా ఈబేనర్ పెద్దగా యాక్టివ్‌గా లేదు.
ఇక తాజాగా 'మహానటి' ఇచ్చిన ప్రోత్సాహంతో త్వరలో అశ్వనీదత్, దిల్‌రాజుతో కలిసి వంశీపైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా ఓ చిత్రం చేయనున్నాడు. ఇక నుంచి తమ బేనర్ నుంచి రెగ్యులర్‌గా చిత్రాలు వస్తాయని చెప్పిన అశ్వనీదత్ త్వరలో తాము ఎన్టీఆర్‌తో ఓ చిత్రం చేయనున్నామని, ఈ చిత్రానికి దర్శకత్వం ఎవరు వహిస్తారనే విషయాన్ని త్వరలో తెలియజేస్తామని తెలిపాడు. మరి 'కంత్రి, శక్తి'ల గాయాలను ఈ చిత్రమైనా మాన్పుతుందో లేదో వేచిచూడాల్సివుంది....!