Advertisementt

తెలంగాణ రాష్ట్ర క్రికెట్ జట్టులో హీరోయిన్!

Wed 16th May 2018 03:18 PM
rashmika mandanna,cricket coach,hyderabad,vijay deverakonda  తెలంగాణ రాష్ట్ర క్రికెట్ జట్టులో హీరోయిన్!
Rashmika Mandanna Cricket Coaching For Dear Comrade తెలంగాణ రాష్ట్ర క్రికెట్ జట్టులో హీరోయిన్!
Advertisement
Ads by CJ

ఇతర భాషల నుండి మన తెలుగులోకి వచ్చి చాలా మంది హీరోయిన్స్ సెటిల్ అయ్యిపోయారు. ఆ హీరోయిన్స్ కొంచెం బాగుండి..కొంచెం నటన వస్తే చాలు వాళ్లకి ఒక అరడజన్ సినిమాలు దాకా డోకా ఉండదు. అయితే అలానే 'ఛలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన రష్మిక మండన్న, కుర్రకారు హృదయాలను దోచేసింది.

తొలి సినిమాతోనే హిట్ కొట్టడంతో ఆమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. అలానే ఆమెకు విజయ్ దేవరకొండ సరసన 'డియర్ కామ్రేడ్' సినిమా చేయనుంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. వచ్చే నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఆరంభించనున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మండన్న తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించే ఒక క్రికెటర్ గా కనిపించనుంది. అందుకోసం ఈ అమ్మడు క్రికెట్ నేర్చుకుంటోంది. ఆమె హైదరాబాద్ క్రికెట్ క్లబ్ లో శిక్షణ పొందుతోందట. ఈ పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఆమె వుంది.

Rashmika Mandanna Cricket Coaching For Dear Comrade:

Rashmika Mandanna takes cricket coaching in Hyderabad for Vijay Deverakonda

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ