Advertisementt

విజయ్ దేవరకొండ ఓపెన్ గా చెప్పేశాడు!

Wed 16th May 2018 03:02 PM
allu aravind,felicitation,vijay devarakonda,rajamouli  విజయ్ దేవరకొండ ఓపెన్ గా చెప్పేశాడు!
Vijay Devarakonda thanks to Allu Aravind విజయ్ దేవరకొండ ఓపెన్ గా చెప్పేశాడు!
Advertisement
Ads by CJ

తెలుగు ఇండస్ట్రీలో మెగా ప్రొడ్యూసర్స్‌ అల్లుఅరవింద్‌, అశ్వనీదత్‌లు. వీరిద్దరు మంచి స్నేహితులే కాదు.. పార్ట్‌నర్స్‌ కూడా. ఇప్పటికే 'మహానటి' టీంని మెగాస్టార్‌ చిరంజీవి సత్కరించాడు. మరోవైపు లోకనాయకుడు కమల్‌హాసన్‌ నుంచి మోహన్‌లాల్‌, బాలకృష్ణ వరకు అందరు ఈ చిత్రాన్నికుటుంబ సమేతంగా చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈచిత్రంలో కె.విరెడ్డికి శిష్యుడైన సింగీతం శ్రీనివాసరావు పాత్రని తరుణ్‌భాస్కర్‌ పోషించాడు. సింగీతం సావిత్రితో పలు చిత్రాలకు పనిచేసినా కూడా సావిత్రితో ఆయన ఫొటో తీసుకోలేకపోయాడు. కానీ నేడు కీర్తిసురేష్‌తో కలిసి ఆయన తనకోరిక నెరవేరిందని చెప్పడం బహుశా కీర్తిసురేష్‌కి వచ్చిన బెస్ట్‌ కాంప్లిమెంట్‌గా చెప్పవచ్చు. 

ఇక తాజాగా అల్లుఅరవింద్‌, అల్లుఅర్జున్‌లు 'మహానటి' టీంని పిలిచి పార్టీ ఇచ్చారు. ఇందులో రాజమౌళి, కీరవాణి, విజయ్‌దేవరకొండ, అశ్వనీదత్‌, ఆయన కూతుర్లు, ఈచిత్రాన్ని నిర్మించిన స్వప్నాదత్‌, ప్రియాంకాదత్‌, మహానటి దర్శకుడు నాగ్‌అశ్విన్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్‌దేవరకొండ ట్వీట్‌ చేస్తూ 'ఈ యూనిట్‌కి డిన్నర్‌ పార్టీ, మహానటికి పార్టీలు, సన్మానాలు. కానీ నిన్నరాత్రి దుల్కర్‌ని, సమంతను మిస్‌ అయ్యాను. మా ముఖ్యమైన వ్యక్తి, గురువు నాగ్‌ అశ్విన్‌ని మల్టీమిలియనీర్స్‌ వైజయంతీ మూవీస్‌ని అభినందించినందుకు, ఇండస్ట్రీని ఒక చోటికి చేర్చినందుకు అరవింద్‌ సార్‌కి థాంక్యూ' అని తన అభినందనలను ట్వీట్‌ చేశాడు. 

ఇక ఈసందర్భంగా రాజమౌళి మాట్లాడిన మాటలు అద్భుతంగా ఉన్నాయి. మొదట సావిత్రి బయోపిక్‌ని తీస్తున్నారని తెలిసి అసలు పట్టించుకోలేదు. నాకసలు అంచనాలే లేవు. ఈ సినిమాహిట్‌ అవుతుందని అనుకోలేదు. కానీ ఈచిత్రాన్ని చూసిన తర్వాత ఇది ఇండస్ట్రీ స్థాయిని పెంచే చిత్రమని అర్ధమైంది. ప్రతి అంశాన్ని రాసిన విధానం, నటీనటులు నటన అద్భుతంగా ఉన్నాయి. ఈ క్రెడిట్‌ నాగ్‌అశ్విన్‌కే దక్కుతుంది. సావిత్రి, జెమినిల మద్య ప్రేమ పుట్టుక, విబేధాలు, సావిత్రి మద్యం తాగడం, ఇలా ప్రతి అంశాన్ని ఎంతో పోయిటిక్‌గా చూపించారు. నాగ్‌ అశ్విన్‌ని చూస్తుంటే నాకు అసూయగా ఉంది. నేను కూడా ఇలాంటి చిత్రం తీయలేనేమో అని రాజమౌళి చెప్పడం గ్రేట్‌ అనే చెప్పాలి. 

Vijay Devarakonda thanks to Allu Aravind:

Allu Aravind felicitates Mahanati Team

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ