Advertisementt

మెగాస్టార్ కి పంచ్: మీ మనవరాలే బెటర్‌!

Wed 16th May 2018 12:58 AM
granddaughter,amitabh bachchan,avengers  మెగాస్టార్ కి పంచ్: మీ మనవరాలే బెటర్‌!
Amitabh trolled for his tweet on Avengers మెగాస్టార్ కి పంచ్: మీ మనవరాలే బెటర్‌!
Advertisement
Ads by CJ

నిజంగా కొన్ని ఇంగ్లీషు చిత్రాలు చిన్నారులను బాగా ఆకట్టుకోవడమే కాదు. వారికి బాగా అర్ధమవుతాయి. ఇక నేటి తరం జనరేషన్‌ పిల్లలు స్మార్ట్‌ ఫోన్‌ల నుంచి కంప్యూటర్ల వరకు వారి పెద్దల కంటే ముందుంటారు. వారిని అడిగి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని సినిమాల కథలను కూడా పిల్లలను అడిగితే మనకంటే బాగా చెబుతారు. ఇక విషయానికి వస్తే బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌ చాలా ముక్కుసూటిగా, ఓపెన్‌హార్టెడ్‌గా ఉంటాడు. ఆయన చేసే ట్వీట్స్‌ కూడా అలాగే ఉంటాయి. 

తాజాగా ఆయన ట్వీట్‌ చేస్తూ, అవేంజర్స్‌ ఇన్ఫినిటీ చూశాను. సర్‌.. తప్పుగా అనుకోకండి.. ఆ సినిమా జరుగుతున్నంత సేపు ఏమి జరుగుతుందో ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు అని ట్వీట్‌ చేశాడు. దానికి స్పందించిన అవేంజర్స్‌ ఫ్యాన్స్‌ ఆయనకు కౌంటర్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు. అవేంజర్స్‌ సిరీస్‌లోని అన్ని భాగాలను చూస్తే మీకు ఈ చిత్రం అర్ధమయ్యేది అని ఓ నెటిజన్‌ తెలిపాడు. మరోనెటిజన్‌ 'ఈ విషయంలో మీకంటే మీ మనవరాలు ఆరాధ్యనే బెటర్‌. ఆమెకి సినిమా బాగా అర్ధమై ఉంటుంది; అని సెటైర్‌ వేశాడు. 

చిన్నపిల్లలకు ఆ సూపర్‌ హీరోస్‌ గురించి బాగా తెలుసు. కాబట్టి మీ ముద్దుల మనవరాలిని అడిగి కథను మొత్తం తెలుసుకోవాలని మరో నెటిజన్‌ సలహా ఇచ్చాడు. సరదాగా మెగాస్టార్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. ఇండియాలో 230 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇన్ఫెనిటీ స్టోన్స్‌ సాయంతో సగం విశ్వాన్నినాశనం చేయాలని భావించే ధానోస్‌ అతనిని అడ్డుకునేందుకు అవేంజర్స్‌ చేసిన పోరాటాలతో ఈ చిత్రం రూపొందింది..! 

Amitabh trolled for his tweet on Avengers:

Granddaughter Better Than Megastar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ