కొన్నిసార్లు సరదాగా చేసిన వ్యాఖ్యలే పెద్దది అవుతాయి. నాన్నాపులి లాగా మారిపోతుంటాయి. ఇక ఇటీవల కావాలని చేసిందో, అనుకోకుండా అనేసిందో గానీ 'కొమరం పులి' ఫేమ్ నికీషా పటేల్ తనకు, తన కుటుంబ సభ్యులకి కూడా ప్రభుదేవాతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పింది. ప్రభుదేవాతో కలిసి నటిస్తారా? అని అడిగితే, మీరు కేవలం నటిస్తారా? అని అడుగుతున్నారు. నేనైతే ప్రభుదేవాని వివాహం చేసుకోవాలని భావిస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వెంటనే ఆమె ప్రభుదేవాతో సన్నిహితంగా ఉంటున్న ఫొటోలో సోషల్ మాధ్యమాలలో కనిపించాయి. దాంతో నయనతార విషయంలో దెబ్బతిన్న ప్రభుదేవా, నికీషాపటేల్ మద్య ఏదో నడుస్తోందని వార్తలు వచ్చాయి. దీనిపై నికీషా పటేల్ స్పందించింది.
ప్రభుదేవా గురించి తనతో లింక్ చేసి పలు వార్తలు వస్తున్నాయని, వాటికి చెక్ పెట్టాల్సిన సమయం వచ్చిందని తెలిపిన నికీషా తాను ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో బిజీగా ఉన్నానని తెలిపింది. నేను ప్రభుదేవానే కాదు.. ఎవరినీ పెళ్లి చేసుకోవడం లేదు. ప్రేమించడం లేదు. ఆయన నాకు మంచి స్నేహితుడు, సన్నిహితుడు మాత్రమే. ఆయన నాశ్రేయోభిలాషి, ఆయనను నేను గౌరవంగా సార్ అని పిలుస్తాను. ప్రభుదేవాపై ఉన్న గౌరవం, అభిమానంతోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా ఆమె క్లారిటీ ఇచ్చింది.
ఇక నికిషా పటేల్ తొలి చిత్రం 'కొమరం పులి'లో పవన్ సరసన నటించిన ఆ తర్వాత 'ఓం, అరకురోడ్డులో' వంటి తెలుగు చిత్రాలలో నటించింది. ఇక ఈమె తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో 'తేరీ మొహర్బానీయా 2'లో కూడా యాక్ట్ చేస్తోంది.