మన హీరోలలో వరుస సక్సెస్‌లు, సాధారణ కంటెంట్ ఉన్న చిత్రాలు కూడా హిట్టయిపోతే ఇక తామేం తీసినా జనాలు చూస్తారనే ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. ఇదే ఇటీవల ఇద్దరు స్టార్స్‌కి ఎదురైంది. వారే స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్, నేచురల్ స్టార్ నాని. 'ఎంసీఏ' చిత్రం సాధారణ కంటెంట్‌తో కూడా హిట్ కొట్టినా కూడా నాడే విశ్లేషకులు నాని ఎంచుకుంటున్న కథలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో 'ఎంసీఏ'తో వచ్చింది కూడా 'కృష్ణార్జునయుద్దం'తో ప్రేక్షకులు నానికి ఫ్లాప్ రుచి చూపించి డబుల్ బోనాంజా అందించారు. ఇక బన్నీ పరిస్థితి కూడా అదే.
'సరైనోడు', 'డిజె'లు డివైడ్ టాక్ తెచ్చినా కూడా వాటి కలెక్షన్లు నిజమో కాదో తెలియదు గానీ నిర్మాతలు మాత్రం మీడియా మీద మండిపడి తమది హిట్సేనన్నారు. కానీ ఆ బాకీని కూడా ప్రేక్షకులు ఊరికే వదిలేయలేదు. 'నాపేరు సూర్య...నా ఇల్లు ఇండియా'కి ఫ్లాప్ రుచి చూపించారు. ఇంకా ఈ చిత్రం సమయానికి కాస్త బన్నీ.. పవన్‌తో మరలా కలిసి పోవడం కాస్తైనా మేలుచేసింది. అది కూడా లేకుండా ఉండి, పవన్ అభిమానులు బన్నీపై అదే స్థాయిలో మండిపడుతుంటే ఈ మాత్రం కలెక్షన్లు కూడా వచ్చేవి కావు. ఇక తన ప్రతి చిత్రం సమయంలో తనకు పోటీగా వచ్చిన చిత్రాలకు చుక్కలు చూపించిన బన్నీకి ఈ సారి సీన్ రివర్స్ అయింది. ఐదురోజుల గ్యాప్‌లో బుధవారమే విడుదలైన 'మహానటి' తమనేమీ చేయలేదని మన బన్నీ అండ్ టీం కాస్త ఏమరుపాటుతో ఉండి, కనీస ప్రమోషన్స్ కూడా చేయకుండా చూస్తుండిపోయారు. దీంతో 'మహానటి' 'నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా'ను చావు దెబ్బకొట్టింది.
మరోవైపు ఇప్పటికీ చాలా సెంటర్లలో 'రంగస్థలం, భరత్ అనే నేను' కూడా స్టడీ కలెక్షన్లు సాధిస్తోంది. ఇక 'మహానటి' ఉదృతం వీక్‌డేస్‌లోనే సూర్యని ఉక్కిరిబిక్కిరి చేయగా, ఇక వీకెండ్‌లో 'మహానటి' తన హవా సాగించనుంది. నిజానికి 'మహానటి'కి 'రంగస్థలం, భరత్ అనే నేను' సినిమాల కంటే మించిన టాక్ వచ్చింది. దీంతో పలు సెంటర్లలో 'నాపేరు సూర్య...నా ఇల్లు ఇండియా' ఆడుతున్న స్క్రీన్లను 'మహనటి'కి కేటాయిస్తున్నారు. మొదటి వారం తర్వాత సూర్యకి పెట్టిన పెట్టుబడిలో సగం మాత్రమే రికవరీ కావడంతో బన్నీకి తన కెరీర్‌లోనే ఇది కూడా వన్ ఆఫ్ ది డిజాస్టర్‌గా నిలవడం ఖాయమని తేలిపోతోంది. ఇక ఓవర్‌సీస్‌లో ఈ సినిమా పరిస్థితి మరింత దారుణం.