పుట్టుటయు నిజము.. గిట్టుటయు నిజము.. నట్టనడిమి జీవితం నాటకం అని అన్నట్లుగా తాజాగా అల్లుఅర్జున్ అభిమాని దేవసాయి గణేష్ కన్నుమూశాడు. దేవసాయిగణేష్ అల్లుఅర్జున్‌కి వీరాభిమాని. ఆయనంటే ఎంతో ఇష్టం. ఈయనకు బోన్ క్యాన్సర్ రావడంతో తన చిట్టచివరి కోరికగా తన అభిమాన హీరో బన్నీని చూడాలని కోరాడు. ఈ విషయం తనటీం, డాక్టర్ల ద్వారా తెలుసుకున్న బన్నీ'నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా' చిత్రం ప్రమోషన్స్‌లో ఊపిరి సలపని బిజీలో ఉండి కూడా వీలు చూసుకుని విశాఖపట్టణం సమీపంలోని అనకాపల్లికి వెళ్లి ఆ అభిమానితో మాట్లాడి, ఆయనకు దైర్యం చెప్పాడు.
అంతేకాదు.. వైద్యచికిత్సల కోసం 10లక్షలు ఆర్దికసాయం కూడా చేశాడు. తన చివరి రోజుల్లో తన అభిమాన నటుడిని చూసినందుకు దేవ్‌సాయి గణేష్ ఎంతో ఆనందంగా ఫీలయ్యాడు. ఈయన కోలుకుంటాడని అందరు భావిస్తున్న తరుణంలోఈయన వైద్యుల చికత్సకు స్పందించకుండా బోన్‌క్యాన్సర్ వల్ల మృతి చెందాడు. గతంలో ఓ అభిమాని మరణించినప్పుడు తమిళస్టార్ కార్తి ఆయన అంత్యక్రియలకు హాజరై చిన్నపిల్లాడిలా బోరున ఏడవడం నిజంగా అందరిమనసులను కలిచివేసింది.
ఇలాగే గతంలో మహేష్, పవన్, ఎన్టీఆర్ వంటి వారు కూడా తమ అభిమానుల కోర్కెలను తీర్చారు. ఇకదేవ సాయిగణేష్ మరణంతో అల్లుఅర్జున్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. సాయి గణేష్ మరణ వార్త విని నా గుండె పగిలిపోయింది. అతని కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా హృదయపూర్వక సానుభూతి అని బన్నీ తెలిపాడు. మొత్తానికీ ఈ అభిమాని మరణవార్తవిని బన్నీఅభిమానులేకాదు.. అందరు హీరోల అభిమానులు కూడా సంతాపం, బాధని వ్యక్తం చేస్తున్నారు!