Advertisementt

అరెరె.. పవన్ మిస్ అయ్యాడే..!!

Tue 15th May 2018 01:30 PM
mega family,mothers day,special pic,pawan kalyan,tirumala  అరెరె.. పవన్ మిస్ అయ్యాడే..!!
Chiranjeevi, Naga Babu take blessings of their mother అరెరె.. పవన్ మిస్ అయ్యాడే..!!
Advertisement
Ads by CJ

మాములుగా పెళ్ళై పిల్లలున్నప్పటికీ.... కొంతమందికి అమ్మంటే ప్రాణం. అమ్మనాన్నలతో టైం స్పెండ్ చేయాలనీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇక ప్రత్యేకించి మదర్స్ డే అంటే అందరికి అమ్మతో కాసేపు గడపాలనిపిస్తుంది. ఇక సెలబ్రిటీస్ మొత్తం నిన్న ప్రత్యేకించి అమ్మతో గడిపిన కొన్ని క్షణాల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలానే నిన్న మదర్స్ డే సందర్భంగా మెగా బ్రదర్స్ వాళ్ల అమ్మ అంజనాదేవితో గడిపారు. ఆ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి.. తమ్ముడు నాగబాబు తమ తల్లి ఆశీస్సులు పొందారు.

వీరితో పాటు ఇద్దరు సోదరీమణులు తమ తల్లి అంజనాదేవికి మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పారు. వీరు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛం అందజేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి.. నాగబాబు వారి అమ్మ గురించి చాలా సార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయ్. ఇక ఈ పిక్ లో చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం మిస్ అయ్యాడు. పవన్ తిరుపతిలో కాలినడకన శ్రీవారి దర్శనం చేసుకోవడానికి తిరుమల్లో ఉండడంతో ఆయన ఈ స్పెషల్ పిక్ లో మిస్ అయ్యాడు.

ఇక పవన్ కళ్యాణ్ లేకపోయినా మెగా బ్రదర్స్ తో పాటు మెగా సిస్టర్స్ కూడా ఈ పిక్ లో సందడి చేయడంతో.. మెగా ఫాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి మథర్స్ డే రోజున చిరు తో పాటుగా ఆయన తల్లి, తమ్ముడు, అక్క చెల్లెళ్ళ తీయించుకున్న ఆ ఫోటో ని మీరు ఓ లుక్కెయ్యండి.

Chiranjeevi, Naga Babu take blessings of their mother:

Mega Family Mothers Day Special Pic

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ