నిర్మాత దానయ్య, రామ్‌చరణ్‌ల సుడి మామూలుగా లేదు. 'రంగస్థలం' చిత్రం 200కోట్లు క్రాస్ చేసిన నేపధ్యంలో ఆయన తదుపరి చిత్రమైన దానయ్య-బోయపాటి-రామ్‌చరణ్‌ల చిత్రంపై భారీ అంచనాలు, భారీ బిజినెస్‌కు వేదికగా నిలుస్తోంది. ఇక ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్న రామ్‌చరణ్, కైరా అద్వానీలే కాదు.. పవర్‌ఫుల్ విలన్‌గా నటిస్తున్న వివేక్ ఒబేరాయ్‌ది కూడా పవర్‌ఫుల్ పాత్ర కావడంతో దీనికి నార్త్ ఇండియాలో మంచిక్రేజ్ వచ్చింది.
ఈ చిత్రం హిందీ అనువాద హక్కులను ఓ నార్త్ ఇండియన్ సినీ ప్రొడక్షన్ హౌస్ ఏకంగా 21 కోట్లకు డీల్ కుదుర్చుకుందని సమాచారం. ఈలెక్కన రామచరణ్ కెరీర్‌లోనే హిందీలో ఇదే భారీ రేటు అంటున్నారు. ఇక ఆల్‌రెడీ బోయపాటి తీసిన 'సరైనోడు' చిత్రం హిందీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇవ్వన్నీ ఈ చిత్రానికి ప్లస్ కానున్నాయి. ఈ చిత్రం మూడో షెడ్యూల్ ప్రస్తుతం బ్యాంకాంక్‌లో జరుగుతోంది. ఇక్కడ కీలకమైన సన్నివేశాలను, చరణ్, కైరా అద్వానీల మద్య వచ్చే రెండు పాటలను చిత్రీకరించనున్నారు.
ఇక ఇందులో ఐటంసాంగ్ కోసం మొదట కేథరిన్ ని అనుకున్నా, 'బాహుబలి'తో పాటు పలు హిందీ చిత్రాలలో నటించిన తమన్నాని తీసుకున్నారు. దాంతో ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్‌గా ఇది నిలిచింది. గతంలో చరణ్, తమన్నాలు కలిసి 'రచ్చ'లో రచ్చరచ్చ చేశారు. ఇందులో మరో పవర్‌ఫుల్ పాత్రని జగపతిబాబు పోషిస్తున్నాడు. దీనికోసం ఆయన పలు చిత్రాలను వదులుకున్నాడు.