సాధారణంగా ఒక రాష్ట్రం ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించి, దేశ రాజకీయాలను ప్రభావితం చేయబోయే స్థాయికి చేరడం కర్ణాటకలో కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో బిజెపికి ఓటమి ఎదురైతే బిజెపి ఓటముల పర్వం కర్ణాటక నుంచే ఎదురవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో దక్షిణాదిలో తమకు పట్టు ఉన్న ఏకైక రాష్ట్రాన్ని వదులుకోవడానికి బిజెపి సిద్దంగా లేదు. అందువల్ల దక్షిణాదిలోని రెండు తెలుగు రాష్ట్రాలను, తమిళనాడులకు అన్యాయం చేసి మరీ కావేరి అంశాలు ఇతర సామదాన దండోపాయాల ద్వారా బిజెపిని కర్ణాకటలో గెలిపించుకోవాలని అత్యంత కీలకమై వ్యూహకర్తలైన మోదీ, అమిత్‌షాలు చెమటోడ్చారు.
ఇక బిజెపి మతం నినాదాన్ని తెరపైకి తెస్తే కాంగ్రెస్ కులం, ప్రాంతీయ వాదాలను, కర్ణాటకకి ఓ ప్రత్యేక జెండా కూడా ఉండాలని సున్నిత అంశాలను బాగానే క్యాష్ చేసుకుంటూ ఉంది కానీ ఒకటి మాత్రం నిజం. మొదట కర్ణాటక ఎన్నికలు మోదీ వర్సెస్ రాహుల్‌గాంధీలా మారుతాయని భావిస్తే తెలుగు నాట వైఎస్‌రాజశేఖర్‌రెడ్డిలా బలమైన పునాదులు వేసుకున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం దీనిని మోదీ వర్సెస్ సిద్దరామయ్యగా మార్చివేయడం ఆయనలోని బలమైన నాయకుడిని చాటుతోంది. ఇక కర్ణాటక పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్‌పోల్స్ మూకుమ్మడిగా వెలువడుతున్నాయి. ఇక కర్ణాటకలో హంగ్ వచ్చే అవకాశాలే ఎక్కువని, ముఖ్యంగా ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కూడా జెడిఎస్‌తో మైత్రి తప్పనిసరి అనే విధంగా ఎగ్జిట్‌పోల్స్ ఉన్నాయి.
అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బిజెపి నిలుస్తుందా? కాంగ్రెస్ వస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. జెడిఎస్ ఎన్నికల ఖర్చుని కూడా బిజెపినే భరించిందని, కానీ తెలుగు ఓటర్లు, ఏపీ, తెలంగాణలకు సరిహద్దులుగా ఉన్న ప్రాంతాలలోని తెలుగు ఓటర్లు కీలకంగా మారారు. మరి జెడిఎస్ రేపు బిజెపికి మద్దతు ఇస్తే జెడిఎస్‌కి మద్దతు తెలిపిన పవన్ ఏమి సమధానం చెబుతాడో చూడాలి. ఇక ఈ ఎగ్జిట్‌పోల్స్‌ని చూసిన కేటీఆర్ రెండు జాతీయ మీడియాలు బిజెపి పెద్ద పార్టీగా అవతరిస్తుందని అంటున్నాయని, మరో రెండు చానెల్స్ కాంగ్రెస్‌నే విజయం అంటున్నాయని, వీటిని చూసిన తర్వాత కన్‌ఫ్యూజన్ రావడం ఖాయం.. బహుశా ఎగ్జిట్‌పోల్స్‌లో కూడా హంగు వచ్చింది అంటూ జోక్ పేల్చి నవ్వుతూ ఉన్న ఎమోజీని పెట్టాడు.