ఇటు నడిగర్ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా, నిర్మాతల మండలి అద్యక్షుడుగా బిజీగా ఉన్న విశాల్ సినిమాల విషయంలో కూడా ఇప్పుడు దూకుడు పెంచాడు. తమిళనాడులో థియేటర్ల సమ్మె తర్వాత తాజాగా విడుదలైన విశాల్, సమంతల చిత్రం 'ఇరుంబుదిరై' చిత్రం రిలీజ్ అయి సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని ఈనెల 17న 'అభిమాన్యుడు' అనే టైటిల్‌తో విడుదల చేస్తామని చెప్పారు. ఇక ఈ చిత్రానికి తెలుగులో సమంత పెద్ద అట్రాక్షన్ కాగా, విశాల్ మరో సినిమాను కూడా విడుదలకు సిద్దం చేసే పనిలో బిజీగా ఉన్నాడు.
2005లో లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన 'పందెంకోడి'కి ఇది సీక్వెల్. మొదటి చిత్రంలో విశాల్‌కి తండ్రిగా నటించిన రాజ్‌కిరణే ఇందులో కూడా నటిస్తున్నాడు. ఇక హీరోయిన్‌గా 'మహానటి'తో సంచలనం సృష్టించిన కీర్తిసురేష్‌ని పెట్టుకోవడం బిజినెస్ పరంగా, క్రేజ్ పరంగా మంచి ఆలోచనే. ఇక ఇందులో ఓ నెగటివ్ పాత్రను నిన్నటివరకు విశాల్ ప్రేమికురాలిగా కోలీవుడ్‌లో పేరు తెచ్చుకున్న వరలక్ష్మీ శరత్‌కుమార్ నటిస్తోంది.
ఈ పాత్ర 'నరసింహ' చిత్రంలో నీలాంభరిని మించిన రేంజ్‌లో ఉంటుందని అంటున్నారు. ఇక ఈ పాత్ర గతంలో విశాల్ నటించిన 'పొగరు' చిత్రంలో విలన్‌షేడ్స్ ఉన్న పాత్ర చేసిన విశాల్ అన్నయ్య భార్య శ్రియారెడ్డి పాత్రలా కూడా ఉంటుందని విశాల్ నమ్మకంగా ఉన్నాడు. ఇప్పటికీ విశాల్ కెరీర్‌లో 'పందెంకోడి'నే పెద్ద హిట్. ఈచిత్రం తమిళనాటనే కాదు తెలుగు నాట కూడా ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి కలెక్షన్ల వర్షం కురిపించింది. సో.. 'పందెంకోడి2' చిత్రం విశాల్‌కి ఎంతటి విజయాన్ని అందిస్తుందో వేచిచూడాల్సివుంది....!