అల్లు అర్జున్ సినిమాలు ఎలా ఉన్న బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటాయి. అందుకు ఉదాహరణ 'డీజే' సినిమా. 'డీజే' సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చిన కలెక్షన్స్ విషయంలో బాగానే వసూల్ చేసింది. అల్లు అర్జున్ మాస్ ఫాలోయింగ్ తో పాటు ఫ్యామిలీ ఫాలోయింగ్ కూడా ఉంది. ఒకసారి ఫ్యామిలీ ఆడియన్స్ నమ్మకాన్ని చూరగొంటే ఇక వారి నుంచి లాయల్‌గా వసూళ్లు వచ్చేస్తుంటాయి.
వారికి కావాల్సిన అంశాలు కామెడీ.. మంచి సాంగ్స్.. క్యారెక్టర్లు అంతే.. ఇవి ఉంటే చాలు సినిమాను హిట్ చేసేస్తారు. కానీ రీసెంట్ గా విడుదల అయినా 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' సినిమాలో ఇవేమి లేవు. అయితే మొదటిసారిగా తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చి ఈ సినిమా చేసాడు. సో దాంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను చూడడానికి వెనక్కి తగ్గుతున్నారు.
కలెక్షన్స్ విషయంలో మొదటివారం పర్లేదు అనుకున్న రెండో వారం వచ్చేసరికి ఇంకా స్ట్రగుల్ అవుతోంది. మరి తన తప్పులు తెలుసుకుని..తాను చేయబోయే నెక్స్ట్ సినిమాలో ఇవేమి జరగకుండా చేసుకుంటాడేమో చూడాలి. ఇకనైనా ఎక్సపెరిమెంట్స్ జోలికి వెళ్లకుండా సినిమాలు చేస్తాడని ఆశిద్దాం.