తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో.. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన చిత్రం 'టెంపర్'. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటన అతన్ని మరో మెట్టు ఎక్కేలా చేసింది. కమర్షియల్ గా ఈ చిత్రం అప్పట్లో బాగా వసూల్ చేసింది. యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. అప్పటివరకు పరాజయాలను ఎదుర్కొన్న ఎన్టీఆర్, ఈ సినిమా నుంచే వరుస విజయాలను అందుకుంటూ వెళుతున్నాడు.
ఈ సినిమా కథ దాని ట్రీట్మెంట్ ఇతర భాషల్లోని హీరోలను సైతం ఆకర్షించాయి. దానితో వాళ్లంతా ఈ సినిమాను రీమేక్ చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు. బాలీవుడ్ లో రోహిత్ శెట్టి డైరెక్టర్ గా రణ్వీర్ సింగ్ హీరోగా ఈ సినిమా రీమేక్ అవుతుంది. మరోపక్క తమిళంలో ఈ సినిమా రీమేక్ లో చేయడానికి విశాల్ రంగంలోకి దిగాడు.
దానికి సంబంధించి వర్క్ కూడా స్టార్ట్ చేసారు. ఈ కథలోని పాయింట్ ను మరింత బలంగా చెప్పాల్సిన అవసరం ఉందని విశాల్ భావించాడట. అందుకే కొన్ని సన్నివేశాలతో పాటు .. క్లైమాక్స్ ను కూడా మార్చాలని నిర్ణయించుకున్నాడట. తమిళ జనాల టేస్ట్ కి తగినట్లుగా కథలో మార్పులు చేయాలనీ విశాల్ బావిస్తున్నాడంట. మరి అతను చేసే మార్పులు అక్కడ ఆడియన్స్ ను ఎంతవరకూ మెప్పిస్తాయో చూడాలి.