తెలుగులో సౌందర్య, అనుష్క, కాజల్‌ల తర్వాత ఎక్కువకాలం హీరోయిన్‌గా కొనసాగిన నటిగా తమన్నాభాటియాను చెప్పుకోవచ్చు. ఇక ఈమె వయసు ప్రస్తుతం 28. ఆమె సినిమాలలో తెరంగేట్రం చేసి దశాబ్దన్నర అయింది. అంటే 15ఏళ్లు అన్నమాట. అయినా ఈమె ఫిట్నెస్, డ్యాన్స్‌లలో చూపించే ఈజ్‌లని చూసి ఈమెతో కలిసి నటించాలని మెగాస్టార్ చిరంజీవి కూడా ఇష్టపడటంతో పాటు తన తాజా చిత్రం 'సై..రా..నరసింహారెడ్డి'లో నరసింహారెడ్డి కోసం ప్రాణత్యాగం చేసే వీరనారి పాత్రని ఇచ్చాడు.
ఇక ఈమె తన 15ఏళ్ల ప్రస్థానం గురించి చెబుతూ, నేను తెలుగు, తమిళం, హిందీ..మూడు భాషల్లోనూ నటించాను, నాకు ఎక్కువగా ఆదరణ లభించింది తెలుగులోనే. మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో ఎక్కువకాలం హీరోయిన్‌గా కొనసాగడం కష్టం. కొంతకాలం తర్వాత ఫేడవుట్ అయిపోయి పక్కన పెట్టేస్తారు. కానీ నాకు మాత్రం ఇప్పటికీ వరుస అవకాశాలు వస్తున్నాయి. నేను స్టార్ హీరోల ఉంచి వర్దమాన హీరోల సరసన కూడా నటించాను. సీనియర్స్‌తో పాటు యంగ్ స్టార్స్‌తో కూడా యాక్ట్ చేశాను. 2005లో నేను నటించిన తొలి చిత్రం తెలుగులో విడుదలైంది.
'బాహుబలి'లో నటించడం కూడా నా అదృష్టం. మంచి విభిన్న పాత్రలు, నాకు బాగా నచ్చే పాత్రలనే చేస్తున్నాను. తెలుగులో గ్యాప్ వచ్చినప్పుడు తమిళంలో 'సురా, తిల్లాలంగడి, చిరుతై, వీరం' వంటి చిత్రాలలో నటించాను. అయితే నేను ఆమధ్య రేసులో కాస్త వెనుకబడిన మాట వాస్తవమే. ఇటు సీనియర్స్, అటు యంగ్‌స్టార్స్ ఇద్దరితో కలిసి నటించడం వల్ల ఆ గ్యాప్ వచ్చిందేమో తెలియదు గానీ ఆ గ్యాప్ మాత్రం తాత్కాలికమే. రానున్నరోజుల్లో నా చేతిలో బోలెడు అవకాశాలు ఉన్నాయని తెలిపింది....!