Advertisementt

'మహానటి'కి యంగ్‌టైగర్‌ ప్రశంస!

Mon 14th May 2018 12:48 PM
jr ntr,mahanati,keerthi suresh,mahanati movie team,praises  'మహానటి'కి యంగ్‌టైగర్‌ ప్రశంస!
Jr NTR praises Mahanati movie Team 'మహానటి'కి యంగ్‌టైగర్‌ ప్రశంస!
Advertisement
Ads by CJ

ఈమద్యకాలంలో 'ఫిదా' ద్వారా సాయిపల్లవి, 'తొలిప్రేమ' ద్వారా రాశిఖన్నా,'భాగమతి' ద్వారా అనుష్క , 'రంగస్థలం' ద్వారా సమంత బాగా అలరించారు. కానీ 'అజ్ఞాతవాసి, గ్యాంగ్‌'లతో ఆకట్టుకోలేకపోయిన కీర్తిసురేష్‌ 'మహానటి'గా మాత్రం అద్భుతం, అత్యద్భుతం అనేలా చేసింది. సావిత్రిలా కనిపించడం వేరు. సావిత్రిలా నటించడం వేరు. ఈ చిత్రంలో కీర్తి నటన తమ కెరీర్‌లోనే చూసిన అత్యద్భుత నటన అని రాజమౌళి నుంచి జయప్రకాష్‌నారాయణ్‌, కేటీఆర్‌.. ఇలా అందరు అభినందిస్తున్నారు. 

ఇక ఈ చిత్రంలో 'గోరింటాకు' సినిమా సెట్‌లో ఎస్వీరంగారావు ఉన్నట్లు చూపించారు. కానీ నాటికి ఎస్వీరంగారావు కాలం చేశారు. కేవలం గుమ్మడి మాత్రమే బతికి ఉన్నారు. 'గోరింటాకు' చిత్రం 1979లో విడుదల కాగా, ఎస్వీఆర్‌ 1974లోనే కాలం చేశారు. ఇక ఈ చిత్రంలో జగ్గయ్య పాత్ర లేకపోవడం కూడా ఒకలోటే. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రని డిజిటల్‌లో చూపించారు. రాజేంద్రప్రసాద్‌ నోటి వెంట ఎన్టీఆర్‌ అనే పేరు వినగానే థియేటర్లు హోరెత్తి పోతున్నాయి. ఆ పాత్రలో నటించనని ఎన్టీఆర్‌ చెప్పారు. కానీ నటించి ఉంటే మాత్రం చిత్రానికి నిండుదనం వచ్చేది. 

ఇక తాజాగా ఈ చిత్రం చూసిన యంగ్‌టైగర్‌ మాట్లాడుతూ.. 'మహానటి'ని అభినందించడానికి మాటలు చాలడం లేదు. బహుశా సావిత్రి గారే కీర్తిసురేష్‌ చేత అలా చేయించారేమో? నాగ్‌అశ్విన్‌ ఆమెకి ఘనమైన నివాళి అందించాడు. ఈ లైఫ్‌ని అందించిన స్పవ్న, ప్రియాదత్‌లకు కృతజ్ఞతలు. దుల్కర్‌, సమంత, విజయ్‌ అందరు అద్భుతంగా చేశారు. మిక్కీ..జె మేయర్‌ అద్భుతమైన మ్యూజిక్‌ అందించాడు... అని చెప్పుకొచ్చారు. నిజమే ఈ మహానటి సినిమాకు గాను ఈ ఏడాది అవార్డులన్ని కీర్తికే దక్కడం ఖాయమని చెప్పవచ్చు.

Jr NTR praises Mahanati movie Team:

Jr NTR Emotional Comments On Mahanati Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ