మిగిలిన రాష్ట్రాల సంగతేమో గానీ పక్క తెలుగు రాష్ట్రమైన తెలంగాణతో పోల్చుకున్నా కూడా మన ఎమ్మెల్యేల కంటే ఎంపీలు పలు వ్యాపారాలతో బిజీబిజీగా ఉంటారు. గల్లాజయదేవ్ నుంచి సుజనా చౌదరి, సీఎం రమేష్, వైసీపీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నుంచి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కావూరిసాంబశివరావు, రాయపాటి సాంబశివరావు నుంచి మురళీమోహన్, కేశినేని నాని వరకు అందరు పారిశ్రామిక వేత్తలే. వీరెవ్వరూ తమ స్వంత నియోజకవర్గాలలో ప్రజలకు అందుబాటులో ఉండరు. వారిని ఓటేసిన తర్వాత ఎన్నికల ప్రచారంలో తప్ప మరలా ఎక్కడా కనిపించరు. మరలా వచ్చే ఎన్నికల సమయంలో మాత్రమే కనిపిస్తారు.
ఇక మురళీమోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలు తీయకపోయిన తన జయభేరి ఇండస్ట్రీస్ ద్వారా రియల్ వ్యాపారంలో మునిగి తేలుతుంటాడు. కానీ మిగిలిన వారితో పోల్చుకుంటే ఈయన కాస్త బెటర్. ఎందుకంటే ఈయన నియోజకవర్గంలోలేని సమయంలో ఆ బాధ్యతలను ఆయన కోడలు చూసుకుని, సమస్యల నిమిత్తం వచ్చే వారికి అందుబాటులో ఉంటుంది. మిగిలిన వారికి సీఎం తమ నియోజకవర్గం వస్తేనో, మరో అత్యవరస పని ఉంటేనే మాత్రం దర్శనభాగ్యం దొరుకుతుంది. ఇక తాజాగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మురళీమోహన్ చాలా బిజీ. ఈయన మంచి నటుడు, నిర్మాత కూడా. కానీపార్టీకి సేవ చేయడానికి మాత్రం ఆయనకు సమయం దొరకదు అని అన్నాడు.
దీంతో స్పందించిన మురళీమోహన్ తనకు సమయం సరిపోవడం లేదని చెప్పాడు. అంతగా ప్రజలను మర్చిపోయి బిజినెస్‌లు చేసుకునే వారికి రాజకీయాలు ఎందుకో అర్ధం కాదు. కేవలం తమ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికే అని చెప్పవచ్చు. ఇక ఉచిత ఇసుక రవాణా, బెల్టు షాపుల విషయంలో అందరు కలిసి పనిచేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశాడు. అయినా చంద్రబాబు తనబినామీపై ఇంతలా జోక్ వేయడం ఏమిటి? మురళీమోహన్‌కి ఉన్న బిజీ షెడ్యూల్ గురించి చంద్రబాబుకి తెలియదా? అనే సెటైర్స్ వినిపిస్తున్నాయి.