Advertisementt

'రాజుగాడు' ఇంత దూలాడేంటీ..?

Mon 14th May 2018 01:08 AM
  'రాజుగాడు' ఇంత దూలాడేంటీ..?
Rajugadu Trailer Released 'రాజుగాడు' ఇంత దూలాడేంటీ..?
Advertisement
Ads by CJ

రాజ్‌తరుణ్‌.. దర్శకుడు కావాలన వచ్చి 'ఉయ్యాలజంపాల, కుమారి 21ఎఫ్‌, సినిమా చూపిస్తమావా, ఆడోరకం ఈడో రకం' వంటి విజయాలతో హీరోగా దూసుకుపోతున్నాడు. కానీ గతకొంతకాలంగా ఆయన నటించిన 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు. రంగుల రాట్నం' చిత్రాలు ఈ యంగ్‌ హీరో స్పీడ్‌కి బ్రేకులు వేశాయి. ఇక ఈయన తాజాగా 'రాజుగాడు'గా రానున్నాడు. ఈ చిత్రం థియేటికల్‌ ట్రైలర్‌ని తాజాగా విడుదల చేశారు. ఇందులో రాజుగాడు దొంగతనం చేయకుండా ఉండలేని పాత్రను చేశాడు. 

ఈ మధ్య పలు మానసిక రోగాల నేపధ్యంలో కధలు వచ్చి హిట్టవుతున్నాయి. 'మహానుబాహుడు', 'సూర్య వర్సెస్‌ సూర్య' వంటి సినిమాలే ఇందుకు ఉదాహరణ. రాబోయే 'సవ్యసాచి'లో రెండో చేయి కూడా బలంగా పనిచేయడం ఇలా సినిమాలు వస్తున్నాయి. ఇక ఇందులో రాజుగాడికి దొంగతనం చేయకుండా ఉండలేదు. ఇది కూడా ఓ మానసిక రోగమే అని కొందరికే తెలుసు. ఇక ఇందులో రాజుగాడు అయిన రాజ్‌తరుణ్‌కి ప్రియురాలిగా అమైరా దస్తూర్‌ నటిస్తుండగా, రాజేంద్రప్రసాద్‌, సితారలు ఆయన తల్లిదండ్రులుగగా నవ్వులు పండిస్తున్నారు. తల్లి కూడా కొడుకు దొంగతనాలను ఇష్టపడే పాత్రేకావడం విశేషం, ఏమి నాయనా.. ఈ రోజు ఏమీ తేలేదు అంటూ ఆమె అంటూ ఉంటుంది. 

ఇక మన రాజుగాడు పర్స్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు దొంగిలిస్తూ ఉంటాడు. మొత్తానికి ఈ చిత్రం థియేటికల్‌ ట్రైలర్‌ మాత్రం బాగా ఆకట్టుకుంటూనే ఉంది. డైలాగ్స్‌ కూడా బాగా పేలాయి. హీరో దొంగతనాలు అంటే కామెడీ సహజం. అందునా రాజ్‌తరుణ్‌ కామెడీ టైమింగ్‌ ఎంతో బాగుంటుంది కాబట్టి ఈచిత్రంపై కాస్త నమ్మకం ఏర్పడుతోంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మంసుంకర నటిస్తున్న చిత్రం ద్వారా సంజనా రెడ్డి అనే మహిళా దర్శకురాలు పరిచయం అవుతోంది. ఈ చిత్రం హిట్టయితే సంజనా మంచి దర్శకురాలిగా నందిని రెడ్డి, బి.ఎ.జయ వంటి వారికి పోటీ ఇవ్వడం ఖాయమనే చెప్పాలి. 

Click Here for Trailer

Rajugadu Trailer Released:

Raj Tarun Rajugadu Trailer Report

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ