చాలా సినిమాలకి రైటర్ గా వర్క్ చేసిన వక్కంతం వంశీ.. దర్శకుడిగా తానేంటో నిరూపించుకోవాలని 'నా పేరు సూర్య' సినిమా తీసాడు. ఈ నెల 4వ తేదీన విడుదలైన ఈ సినిమా అల్లు అర్జున్ నటనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడట్లేదు. అల్లు అర్జున్ గత సినిమా 'డీజే' తో పోల్చుకుంటే వసూల్ విషయంలో ఈ సినిమా డల్ అయిందని చెబుతున్నారు.
తొలివారంలో ఈ సినిమా ఒక్క నైజామ్ లో 11.10 కోట్లను వసూలు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 34.43 కోట్ల షేర్ ను రాబట్టి.. ప్రపంచవ్యాప్తంగా 44.63 కోట్లకి చేరుకుంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ మొత్తంగా 80 కోట్లకి అమ్ముడైంది. అంటే ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లో పడాలంటే ఈ సినిమా ఇంకా 36 కోట్లకి పైగా షేర్ ను రాబట్టవలసి ఉంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 'మహానటి' సినిమా మంచి జోరుమీద దూసుకుపోతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' సేఫ్ జోన్ లోకి వెళ్తుందేమో చూడాలి. అటు ఓవర్సీస్ లో ఈ సినిమాను కొన్న బయర్స్ పరిస్థితి కూడా ఇలాగే వుంది.