గత నెల ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'భరత్ అనే నేను'. కొరటాల శివ - మహేష్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం అందరి అంచనాలు తగట్టుగానే సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది. తొలిసారిగా మహేష్ సీఎం పాత్రలో కనిపించడంతో మాస్..క్లాస్ అని తేడా లేకుండా సినిమాను చూసేస్తున్నారు.
మహేష్ బాబు కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. 200 కోట్లు గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను తన సత్తా చాటింది. కోలీవుడ్ లో ఈ సినిమాకు మంచి వసూళ్లను సాధించడమే కాకుండా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా ఇది నిలిచింది.
దాంతో ఇప్పుడు ఈ సినిమాను తమిళ్ వెర్షన్ లో డబ్ చేయాలనుకుంటున్నారు. అందుకు సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేసారు మేకర్స్. అయితే తమిళ్ వెర్షన్ ను అక్కడ ఎప్పుడు రిలీజ్ చేస్తారో త్వరలోనే ప్రకటించనున్నారు. మరి తమిళ్ వెర్షన్ లో మహేష్ కు ఏ స్థాయిలో ఆదరణ లభిస్తుందనేది చూడాలి.