సినిమా పూర్తి అయిన కొంతకాలానికి సరైన రిలీజ్ డేట్ కుదరక మే 11ను పూరీ జగన్నాథ్.. తన కుమారుడు ఆకాష్‌పూరీని రీలాంచ్ చేస్తున్న 'మెహబూబా'ని ఫిక్స్ చేశాడు. వాస్తవానికి అప్పటికే మే 9వ తేదీకి 'మహానటి' ఫిక్స్ అయినప్పటికీ ఆ చిత్రం ప్రభావం తన చిత్రం మీద ఉండదని, అది ముసలి వారు చూసే సినిమా అయితే తనది యూత్‌ఫుల్ చిత్రంగా విభిన్నమైన పాకిస్తాన్-ఇండియా వార్ నేపధ్యంలో పునర్జన్మల మీద ఆధారపడిన చిత్రంగా ఆయన భావించాడు. కానీ 'మహానటి' టాక్ చూస్తే 'రంగస్థలం'కి మించిన పాజిటివ్ టాక్‌ని తెచ్చుకుంది.
ఇక 'మెహబూబా'పై మొదట్లో అంచనాలు లేకపోయినా సినిమా టీజర్, ట్రైలర్ విడుదలైన తర్వాత దిల్‌రాజు విడుదల చేయనుండటంతో బజ్ తెచ్చుకుంది. కానీ నేడు మాత్రం ప్రేక్షకుల మొదటి చాయిస్ 'మహానటి'కే వేస్తున్నారు. దీంతో పూరీ ప్రభాస్, కోనవెంకట్ వంటి ద్వారా మరో వైపు తాను, చార్మి కలసి ప్రమోషన్స్ పెంచాడు. ఇక ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ, 'మెహబూబా' చిత్రం ట్రైలర్‌లో ఆకాష్‌ని చూసి అతను ఇప్పుడే ఇంత వాడయ్యాడా? అనుకున్నాను. ఎందుకంటే 'బుజ్జిగాడు' చిత్రంలో నా చిన్ననాటి పాత్రను ఆకాష్ చేశాడు. అప్పటికీ ఇప్పటికీ పోల్చుకుని ఆశ్చర్యపోయాను. ఆకాష్ హీరోకావడం నాకు నిజంగా సంతోషానిస్తోంది. తన డైలాగ్ డెలివరితో నటనతో ఆకాష్ నన్ను ఆశ్యర్యపడేలా చేశాడు. ఈ సినిమా సూపర్‌హిట్ కావాలని, ఆకాష్ పెద్ద స్టార్ హీరో కావాలని కోరుకుంటున్నాను.
ఇక టేకింగ్ విషయానికి వస్తే ఇది పూరీ చిత్రంలా అనిపించలేదు. పూరీ ఎక్కువగా హీరోయిజంపై దృష్టి పెడతాడు. అలాంటిది ఈ చిత్రం ట్రైలర్ చూస్తుంటే అందుకు భిన్నంగా ఉంది. పూరీ ఇంతకు ముందు చేసిన చిత్రాల కంటే ఇది డిఫరెంట్‌గా ఉంది... అని చెప్పుకొచ్చాడు. ఇక కోనవెంకట్ మాట్లాడుతూ, ఇది పూరీ ఎంతో ప్రేమించి తీసిన ప్రేమకథా చిత్రం అని తెలిపాడు. 'మహానటి' సక్సెస్ నేపద్యంలో బుధవారం నుంచే పూరీ పబ్లిసిటీ విషయంలో స్పీడు పెంచాడు.