తన ప్రతి చిత్రానికి మిక్స్‌డ్ టాక్ రావడం సహజమేనని, కాబట్టి 'నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా'కు కూడా డివైడ్ టాక్ రావడం తనకేమీ ఆశ్యర్యం కలిగించడం లేదని బన్నీ అంటున్నాడు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ చిత్రం కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. ఇక ఓవర్‌సీస్‌లో 'మహానటి' దెబ్బకు 'నా పేరు సూర్య' కలెక్షన్లకు గండి కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అసలే బన్నీ చిత్రాలకు ఓవర్‌సీస్‌లో ఆదరణ అంతంత మాత్రమే. 'డిజె, సరైనోడు' కూడా అక్కడ తేలిపోయాయి. ఇక తెలుగు రాష్ట్రాలలో బన్నీ సినిమా వస్తోందంటే వేరే సినిమాలకు గండి కొట్టడం ఖాయమని భావిస్తారు. కానీ 'నా పేరు సూర్య...నా ఇల్లు ఇండియా' విషయంలో 'మహానటి' దానిని రివర్స్ చేసింది.
ఇక ఈ చిత్రం విజయోత్సవ వేడుకలను 'థాంక్యూ ఇండియా' పేరుతో జరిపారు. ఈ వేడుకకు పవన్‌కళ్యాణ్ ముఖ్య అతిధిగా వచ్చాడు. సినిమా బాగాలేక పోతే 'అజ్ఞాతవాసి'లా పవన్ చిత్రాలే ఆడని రోజుల్లో ఆయన వల్ల 'నాపేరు సూర్య'కి కలెక్షన్లు పెరుగుతాయని భావించలేం. ఇక ఈ వేడుకలో పవన్‌కళ్యాణ్ ప్రసంగిస్తూ, నిర్మాత లగడపాటి శ్రీధర్‌ని ఉద్దేశించి ఈ చిత్రం చూడాలని ఉందని, ఈ చిత్రం బాగుందని అందరు చెబుతున్నారని, ఈ చిత్రం చూసే తను యాత్రను మొదలుపెడతానని చెప్పాడు. ముందుగా ఆయన నా అన్నదమ్ముళ్లు, అక్క చెల్లెళ్లకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ తన రాజకీయ ప్రసంగాల శైలిలో ప్రసంగం మొదలు పెట్టాడు. తనకి వక్కంతం వంశీ రచయితగానే పరిచయమని, 'కొమరం పులి' చిత్రం సమయంలో ఆయన నాకు ఓ కథ చెప్పాడు. కానీ అది వర్కౌట్ కాలేదని అన్నాడు.
ఇక ఇక్కడికి వచ్చేదాకా చిత్రానికి నిర్మాత మా అన్నయ్య నాగబాబు అన్నది తనకు తెలియదని అన్నాడు. ఇక బన్నీ తన తల్లిదండ్రులకు, తాతయ్యకు మంచి పేరు తేవాలని, వక్కంతం వంశీ మెదటి చిత్రమే టాప్ హీరో బన్నీతో చేశాడని, 'ఆర్య' చిత్రం నుంచి తనకు బన్నీ నటన అంటే ఇష్టమని తెలిపాడు. అయినా పవన్‌తో పాటు బన్నీ దృష్టిలో ఈ చిత్రం హిట్ అంటున్నారంటే కాస్త ముందు వెనుక టాక్‌ని చూసుకుని ప్రసంగాలు చేస్తే బాగుంటుందని చెప్పవచ్చు!