గత రెండు నెలలుగా మీడియాలో శ్రీ రెడ్డి పేరు మార్మోగిపోయింది. పలు ఛానల్స్ లో హీరో అవతారమెత్తిన శ్రీ రెడ్డి, పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో జీరో అయ్యింది. పవన్ కళ్యాణ్ ఇష్యు తర్వాత ఏ ఛానల్ కూడా శ్రీ రెడ్డికి సపోర్ట్ చెయ్యలేదు. గత పది రోజులుగా సైలెంట్ గా ఉన్న శ్రీ రెడ్డి మళ్ళీ వార్తల్లోకొచ్చింది. ఒక జూనియర్ ఆర్టిస్ సినిమా అవకాశాల కోసం కో ఆర్డినేటర్ శ్రీశాంత్ రెడ్డిని కలవగా... అతను ఆ జూనియర్ ఆర్టిస్ట్ ని నమ్మించి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి లొంగదీసుకున్నాడని/... ఆ జూనియర్ ఆర్టిస్ట్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యడానికి శ్రీ రెడ్డిని వెంట తీసుకుని వచ్చింది.
బాధిత మహిళ పోలీస్ స్టేషన్ లోనే శ్రీశాంత్ రెడ్డి పై చెప్పు తో దాడి చెంది. ఈ దాడిని అడ్డుకోబోయిన పోలీసులపై శ్రీ రెడ్డి, ఇంకా అక్కడున్న మహిళలు దాడికి ప్రయత్నించారు. అక్కడున్న మహిళా పోలీస్ లు శ్రీ రెడ్డి తో పాటు మిగతా మహిళలను అడ్డుకుని బయటికి పంపేశారు.