ఈ మద్యకాలంలో తమ చిత్రం ఇంత గ్రాస్ కలెక్ట్ చేసిందని, కాదు కాదు.. తమ చిత్రం ఇంత కొల్లగొట్టిందని పోస్టర్స్‌వేస్తూ తెలుగు సినీ స్టార్స్ నవ్వుల పాలవుతున్నారు. 'రంగస్థలం' 200కోట్లు అని, 'భరత్ అనే నేను' మొదటి వారమే 160 కోట్లకి పైగా వసూళ్లు అని, తాజాగా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుని అందరు పెదవి విరుస్తున్న అల్లు అర్జున్ 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' కూడా మొదటి వీకెండ్‌లోనే 100 కోట్లు అంటూ నానా హంగామా చేస్తున్నారు. నిర్మాతలకే కాదు.. బయ ్యర్లకు, ఎగ్జిబిటర్లకే కాదు.. ఏ సినిమా కలెక్షన్లు ఎంత ఉన్నాయి అనే విషయంలో ప్రేక్షకులకు కూడా ఓ క్లారిటీ ఉంది. దాంతో సామాన్య ప్రేక్షకులకు ఏమి తెలియదని, తాము చెప్పిన కలెక్షన్లను నమ్మేస్తారని నిర్మాతలు భావించడం వారి అవగాహనా రాహిత్యానికి తార్కాణంగా చెప్పాలి, నేటి ప్రేక్షకులు నిర్మాలకు కూడా తెలియని లెక్కలను ఈజీగా కనిపెట్టేస్తారనే విషయం బహుశా జనాల చెవ్వులో పూలుపెట్టడం చూసే నిర్మాతలకు తెలియకపోవచ్చు.
ఇక విషయానికి వస్తే 'హృదయకాలేయం' అనే ఒక్క చిత్రంతో సంచలనం సృష్టించి, సోషల్‌మీడియా స్టార్‌గా పేరు తెచ్చుకుని, రాజమౌలి చేత సెహభాష్ అనిపించుకున్నాడు సంపూర్ణేష్ బాబు. ఇక ఈయన బిగ్‌బాస్ లో కూడా పాల్గొన్నాడు. ఆ తర్వాత ఆయన 'కొబ్బరి మట్ట' అనే చిత్రంలో ఓ కామెడీగా ఉండే ఓ లెంగ్తీ డైలాగ్‌ని సింగిల్ టేక్‌లో చెప్పి సెహభాష్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత కూడా ఈ చిత్రానికి సంబంధించిన కొన్నిస్టార్స్‌ని ఇమిటేట్ చేస్తూ విడుదల చేసిన స్ఫూఫ్ పోస్టర్స్ విడుదలైనా ఈ చిత్రానికి క్రేజ్‌రాలేదు. తాజాగా సంపూ నటించిన 'కొబ్బరిమట్ట' చిత్రంలో 233.64 కోట్లు అని రాసి కండీషన్స్ అప్లై అన్నట్లుగా ఓ స్టార్ గుర్తును ఉంచారు.ఇక రూపాయలా, డాలర్ల అనేది మనం తేల్చుకోవాలి. మొత్తానికి ఈ సమయంలో ఇలాంటి పోస్టర్‌ని విడుదల చేయడంతో సంపూ మన స్టార్స్ మీద సెటైరిక్‌గానే ఈ పోస్టర్ వేయిచాడని అర్థమవుతోంది...!