దాదాపు దశాబ్ద కాలం తర్వాత హీరో రాజశేఖర్ పీఎస్వీ గరుడవేడ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ చిత్రం తర్వాత ఆయన సినిమాల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక పీఎస్వీ గరుడ వేగ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించే చిత్రంలో ఆయన ఓ కీలక పాత్రను. అలాగే దగ్గుబాటి రానాతో 1971 ఇండోపాక్ యుద్దం నేపధ్యంలో తీసే చిత్రంలో కూడా ఆయన నటిస్తాడని తెలుస్తోంది. ఇక ఇటీవల నానిని మెప్పించి ఆయన చేతనే 'అ' చిత్రాన్ని నిర్మింప జేసిన వైవిధ్యచిత్రం తీసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ రాజశేఖర్ హీరోగా ఓ చిత్రం చేయనున్నాడట.
ఈ చిత్రం కోసం 'కల్కి' అనే టైటిల్‌ని కూడా ఖరారు చేశారట. గతంలో తాను ఇలాంటి విభిన్నమైన చిత్రం చేయకపోవడంతో ఈ చిత్రంలో నటించడానికి రాజశేఖర్ ఓకే చెప్పాడు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లననుందని తెలుస్తోంది. మరోవైపు రజనీకాంత్ కూతురు, గతంలో ధనుష్ హీరోగా 'త్రీ' చిత్రానికి దర్శకత్వం వహించిన ఐశ్వర్య ధనుష్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగారూపొందే చిత్రంలో కూడా రాజశేఖర్ మరో తమిళ హీరోతో కలసి ఐశ్వర్య దర్శతకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడని తెలుస్తోంది.