వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మని మతిస్థిమితం లేని వాడిగా కొందరు చూసినా కూడా ఆయన చేసే వ్యాఖ్యల్లో లాజిక్‌ని, ఇతర కోణాలను గమనిస్తే ఆయనెంత మేధావితనంతో మాట్లాడుతాడో అర్ధం అవుతుంది. గుండు సూది నుంచి సబ్బు బిల్ల వరకు, తెలంగాణ కేసీఆర్ నుంచి అమెరికా ట్రంప్ వరకు ఆయనకు తెలియని విషయం ఉండదు. ఆయన వేసే సెటైర్లకు రీసెటైర్ వేయాలంటే ఎవరైనా జంకుతారు. కారణం వర్మ దానిని అడ్డం పెట్టుకుని ఎక్కడ తమ పరువు తీస్తాడో అనేదే వారి భయం. ఇక వర్మ మాటలు కొందరికి పిచ్చిగా ఉండవచ్చు గానీ ఈయన ఫిలాసఫీ, ఐడియాలజీ తెలిసిన సన్నిహితులు మాత్రం ఆయనను పొగడకుండా ఉండలేరు.
ఇక తాజాగా సివిల్స్ ఎగ్జామ్స్‌లో 624వ స్థానం సాధించిన తెలంగాణలోని హన్మకొండకి చెందిన అక్షయ్ కుమార్ మాట్లాడుతూ, వర్మ గురించి తెలుసుకున్న తర్వాత తానెంతో మారిపోయానని తెలిపాడు. వర్మ వల్ల నా మైండ్ సెట్ మారింది. పరీక్షలకు ముందు రోజుల్లోకూడా వర్మ ఏవైనా ట్వీట్స్ లేదా వీడియోలు పెడితే వాటిని చూసే నిద్రపోయే వాడిని. గొప్ప గోప్ప తత్వవేత్తలను వర్మ చిన్నప్పుడే చదివేశాడు. అంతమందిని నేను చదవలేను కాబట్టి ఒక్క వర్మని చదివితే చాలనే నిర్ణయానికి వచ్చాను. సమాజంలోక్రైమ్‌ని వర్మ చూసేవిధానం ఎంతో డిఫరెంట్‌గా, అందరికీభిన్నంగా ఉంటుంది. ఆర్జీవీని ఒకసారి కలవాలని ఉంది.. అని తెలిపాడు.
యడవల్లి అక్షయ్‌కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి వర్మ ట్వీట్ చేస్తూ, ఆ వీడియోను పోస్ట్ చేశాడు. తాను ఎప్పుడు క్రిమినల్స్, పోకిరిలకు స్ఫూర్తిగా నిలుస్తానని పలువురు భావిస్తారు. ఈ సివిల్స్ టాపర్ ఏమి చెప్పాడో చూడండి....! నేను కూడా చదువంటే భయపడిన విద్యార్ధినే. సివిల్ ఇంజనీరింగ్ రెండుసార్లు ఫెయిల్ అయినందుకు నేను గర్వంగా ఫీలవుతాను. ఇక సివిల్ ఇంజనీరింగ్‌లో ఫెయిల్ అయిన వర్మ ఓ సివిల్స్ టాపర్‌కి స్పూర్తిగా నిలవడం నాకెంతో గర్వంగా ఉంది. ఆ సివిల్ టాపర్‌ని ఖచ్చితంగా కలుస్తాను. విద్యా విధానం గురించి చర్చిద్దామని వర్మరిప్లై ఇచ్చాడు.