బోయపాటి చిత్రాలంటే పవర్‌ఫుల్‌గా, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో నిండి ఉంటాయి. ఇక ఈయన 'జయ జానకి నాయకా' పెద్దగా ఆడని నేపద్యంలో డివివి దానయ్య నిర్మాతగా రామ్‌చరణ్, కైరా అద్వానా జంటగా ఓచిత్రం చేస్తున్నాడు.ఇక బోయపాటికి కేథరిన్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్నట్లు కనిపిస్తోంది. కేథరిన్ మొదట నటించిన చిత్రం 'పైసా'. కానీ దానికంటే 'చమ్మక్ చల్లో, ఇద్దరమ్మాయిలతో' చిత్రాలు ముందు వచ్చాయి. ఇక ఈమెకి 'సరైనోడు'లో మంచి ఎమ్మెల్యే పాత్రని ఇచ్చాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత కూడా 'జయ జానకి నాయకా' చిత్రంలో కూడా ఈమె స్పెషల్ సాంగ్‌లో మెప్పించింది.
ఇక బోయపాటి తాజాగా రామ్ చరణ్‌తో చేస్తున్న చిత్రంలో కూడా క్యాథరిన్‌ట్రెసాకి మంచి పాత్రను తయారు చేశాడట. దుబాయ్‌కి చెందిన ఎన్నారైగా గ్లామర్ పాత్రతో పాటు ఓపాట కూడా ఈమెపై ఉంటుందని సమాచారం. ఈ పాటలోని స్టెప్పుల కోసం ఇప్పటికే క్యాథరిన్ విపరీతంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఇందులో కోసం ఆమె న్యూయార్క్‌లోని ఓ డ్యాన్స్ అకాడమీలో స్టెప్పులతో కుస్తీ పడుతోంది. ఈ పాత్ర ఈ చిత్రానికి కూడా ఎంతో కీలకంగా ఉంటుందని సమాచారం.
మరోవైపు రామ్‌చరణ్ నటించిన 'రంగస్థలం' కంటే మొదట మహేష్‌బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్రం కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయని నిర్మాత దానయ్య ప్రకటించాడు. కాగా ప్రస్తుతం దానయ్య రామ్ చరణ్‌తో చిత్రం చేస్తుండటంతో 'భరత్ అనే నేను' కన్నా 'రంగస్థలం' పెద్ద విజయం సాధించిందని, అందువల్ల 200కోట్ల పోస్టర్‌ని 'రంగస్థలం'కే వేయాలి గానీ 'భరత్ అనే నేను'కు వేయవద్దని చరణ్ హెచ్చరికలతోనే 'భరత్' 200కోట్ల పోస్టర్ వేయకపోవడానికి కారణంగా తెలుస్తోంది.