మొదటి నుంచి ప్రేమ కధా చిత్రాలు చేస్తూనే, లవ్‌తో పాటు దేశ భక్తిని మిళితంచేసి 'జై'. అవినీతి పై అస్త్రంగా 'నిజం' వంటి చిత్రాలను తీసిన తేజ ఆ తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్‌ని మాత్రం పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రానా దగ్గుబాటితో 'నేనేరాజు... నేనేమంత్రి' చిత్రం ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు.ఈ చిత్రం తేజకి మంచి పేరునే తీసుకుని వచ్చింది. ఇక విభిన్న చిత్రాలు చేస్తాడనే పేరున్న రానా దగ్గుబాటికి కూడా మంచి హిట్‌ని ఇచ్చింది. ఈ చిత్రం తర్వాత తేజను వెత్తుకుంటూ రెండ ఆఫర్స్ వచ్చాయి. అందులో ఒకటి వెంకటేష్‌తో కాగా రెండోది బాలకృష్ణ తీస్తున్న 'ఎన్టీఆర్' బయోపిక్.
అయితే అనుకోకుండా ఈ రెండు చిత్రాల నుంచి తేజ బయటికి వచ్చాడు. నాగార్జునతో ఆయన ఓ చిత్రం కథ గురించి చర్చలు జరుపుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. తాజాగా సమాచారం ప్రకారం తేజ ఈసారి కూడా మరోసారి రానా తోనే సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. 1971లో వచ్చిన ఇండియా, పాకిస్తాన్ వార్ నేపధ్యంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇక ఇదే ఇండియా, పాకిస్థాన్ యుద్దం నేపధ్యంలోనే గతంలో రానా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో 'ఘాజీ' చిత్రం చేశాడు. అందులో రానా నావీ ఆఫీసర్‌గా కనిపించాడు.
కానీ తేజ చిత్రంలో మాత్రం రానా ఎయిర్‌ఫోర్స్ అధికారిగా కనిపిస్తాడని సమాచారం. ప్రస్తుతం రానా తమిళ, తెలుగు భాషల్లో 'మదై తీరంతు, హాథీమేరా సాథీ' అనే చిత్రాలను చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్స్ పూర్తి అయిన తర్వాత రానా-తేజల చిత్రం పట్టాలెక్కనుంది.