కేవలం నాలుగే నాలుగు చిత్రాలు. 'మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, భరత్ అనే నేను' చిత్రాల ద్వారా రాజమౌళి తర్వాతి స్థానం కొరటాల శివది అయిపోయింది. ఇక ఈయన తదుపరి చిత్రం ఎవరిని అడిగినా స్టార్స్ ఎస్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. రామ్‌చరణ్‌తో ఈయనకు చిత్రం ఉంటుందని వార్తలు వచ్చానా ప్రస్తుతం చరణ్. బోయపాటి, తర్వాత రాజమౌళి చిత్రాలతో బిజీ.
ఇక ఈయన తదుపరి చిత్రం అల్లుఅర్జున్‌తో అనే టాక్ మొదలైంది. బన్నీ తదుపరి చిత్రం దర్శకుడు కూడా ఫైనల్ కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యే అవకాశాలు ఉన్నాయని భావించారు. కానీ తాజాగా సమాచారం ప్రకారం ఇటీవల 'భరత్ అనే నేను' చిత్రం చూసి ఎంతో మెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవికి కొరటాల ఓ కథను చెప్పాడట. మంచి మెసేజ్ కూడా ఉండటంతో ఇది 'ఠాగూర్, స్టాలిన్'లని మించిన స్థాయిలో ఉంటుందని, దాంతో చిరు 'సై..రా' పూర్తి చేసేలోపు మరో మూడు నాలుగు నెలలు కొరటాల కేవలం మెగాస్టార్ చిరంజీవి సిట్టింగ్స్‌లోనే కూర్చొనున్నాడని సమాచారం.
అప్పటిదాకా కొరటాల ఆగుతాడా? ఈమద్యంలో మరో చిత్రం చేస్తాడా? అనేది వేచిచూడాల్సివుంది...!