రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి చిత్రంలో నటిస్తున్నాడు. చెర్రీ - బోయపాటి సినిమాపై అనేక రకాల గాసిప్స్ ప్రచారంలో ఉన్నాయి. అయితే ఆ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెడుతూ చెర్రీ - బోయపాటి మూడో షెడ్యూల్ కోసం బ్యాంకాక్ కూడా వెళుతున్నారు. అయితే బోయపాటి - చెర్రీ సినిమాల విశాఖ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని... ఖచ్చితమైన కథ క్లారిటీ లేకపోయినా అన్నా వదినలు మధ్య పెరిగే చిన్నబాబు పాత్రని చరణ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలా చినబాబు పాత్రకి తగ్గట్టుగా రామ్ చరణ్ ని యంగ్ అండ్ ఎనర్జిటిక్ లుక్ లో బోయపాటి తీసుకొచ్చేశాడంటున్నారు. ఇక ఈ సినిమా కోసం న్యూ హెయిర్ స్టయిల్ లోకి చరణ్ మారినట్లుగా ప్రస్తుతం చెర్రీ లుక్ తెలియజేస్తుంది.
మరి ఇంకా టైటిల్ నే పెట్టని చెర్రీ - బోయపాటి సినిమా శాటిలైట్స్ హక్కులు తెలుగు, హిందీకి కలిపి దాదాపుగా 47 కోట్లకి అమ్ముడై రికార్డు సృష్టించింది. మరి తమిళ హీరో ప్రశాంత్ చరణ్ అన్నగా చేస్తున్న ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. మాస్ కంటెంట్ తో బడా హిట్స్ అందుకున్న బోయపాటి, చరణ్ తో చెయ్యబోయే సినిమాని కూడా సక్సెస్ ఫుల్ గా మలిచి హిట్ కొట్టాలనే కసితో పని చేస్తున్నాడు. అందుకే సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు.
అలాగే ఈ సినిమాలో చెర్రీ కి జోడిగా నటిస్తున్న హీరోయిన్ కైరా అద్వానీ కూడా భరత్ అనే నేను హిట్ ఫుల్ ఫామ్ లో ఉంది. అంతేకాకుండా బోయపాటి గత సినిమాల్లో మాజీ హీరోయిన్స్, హీరోలకు ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా ఈ సినిమాలోనూ పెద్దపీట వేయబోతున్నట్లుగా... అందులో భాగంగానే ఇప్పటికే రమ్యకృష్ణ, స్నేహ వంటి సీనియర్ హీరోయిన్స్ ని అప్రోచ్ అయినట్లుగా తెలుస్తుంది. మరి రంగస్థలం తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రామ్ చరణ్ ఇప్పుడు బోయపాటి సినిమాతోనూ మాస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. చూద్దాం చరణ్ కోరిక, బోయపాటి కసి ఏమేర తీరుతుందో అనేది.