నిజంగా విశాల్‌రెడ్డి గట్స్ ఉన్న వ్యక్తి. ఆయన తానేం అనుకుంటాడో అదే మాట్లాడుతాడు. అదే పని చేసి చూపిస్తాడు. నాడు జల్లికట్లు, చెన్నైలో వరదలు, తమిళ రైతులు ఢిల్లీలో నిరసన సమయం, 'మెర్సల్' చిత్రం విషయంలో మోదీకి భయపడకుండా జీఎస్టీ, డాక్టర్ల దోపిడీని ప్రశ్నించడం, నడిగర్ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా మహామహులను ఓడించి మరీ ఎవ్వరూ చేయలేకపోయిన నడిగర్ సంఘం బిల్డింగ్, కళ్యాణమండపంల నిర్మాణం, ఈ కళ్యాణ మండపం పూర్తి అయిన వెంటనే దానిలో తొలి పెళ్లి తనదేనని చెప్పడం, ఇక నిర్మాతల మండలి అధ్యక్షునిగా టిక్కెట్‌లో రూపాయి రైతులు ఫండ్‌కి ఇవ్వడం, పైరసీపై స్పెషల్‌స్క్వాడ్ వేసి, తాజాగా డిజటల్ సర్వీస్ విషయంలో తెలుగు పరిశ్రమ పోరాటాన్ని మద్యలోనే ఆపేసి సాగిల పడితే విశాల్‌మాత్రం ఈ విషయంలో తన పట్టు వదలలేదు.
ఇక ఇటీవల కూడా ఆయన ఆర్కేనగర్ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని భావించి, నామినేషన్ తిరస్కరణ కారణంగా సైడ్ అయ్యాడు. అయినా ఆయన సామాజిక విషయంలో కూడా తన భావాలను పబ్లిక్‌గా చెబుతూ, అధికారులనైనా, అధినేతలైనా దుమ్మెత్తి పోస్తున్నాడు. ఇక తాజాగా పాలకులను ఉద్దేశించి విశాల్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. నీట్ పరీక్షల విషయంలో అనిత నుంచి కృష్ణ సామి వరకు మరణాలకు పాలకులే కారణమని ఆయన దుయ్యబట్టారు.
పాలకులకు ప్రజలు గుణపాఠం చెప్పితీరుతారని హెచ్చరించాడు. నీట్ పరీక్షల కోసం కస్తూరి అనే విద్యార్ధిని కేరళ తీసుకెళ్లిన అతని తండ్రి గుండెపోటుకి లోనైమరణించాడు. ఈ నేపధ్యంలో విశాల్ ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశాడు. కృష్ణ స్వామి మరణంతో అనాధగా మారిపోయిన మహాలింగం కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకునేందుకు తాను సిద్దంగా ఉన్నానని తెలిపాడు. ఇక విశాల్, సమంత జంటగా నటిస్తున్న 'ఇరుంబుదిరై' చిత్రం 11వ తేదీన తమిళనాడులో విడుదల కానుండగా, ఇదే చిత్రం 'అభిమన్యుడు' పేరుతో 17వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది.