పవన్ ఏదో సామాన్యుడు అని అనుకుంటారు గానీ ఆయన సిగ్గరి అయినా పెద్ద పెద్ద వాళ్లను ముగ్గులోకి దింపడంలో ఆయన సిద్దహస్తుడు. నాడు జనసేన ప్రారంభం నాడు ఆయన పివిపి సంస్థ నుంచి, ఆ సంస్థ అధినేత నుంచి బాగానే సాయం పొందాడు. నాడు ఆయన పార్టీ లాంచింగ్‌కి అయిన ఖర్చు మొత్తం పివిపినే భరించాడని వార్తలు వచ్చాయి. దానికి బదులుగా పివిపి ఎంపీ సీటు అడిగితే అది ఇప్పించలేకపోయాడు. ఇక ఆ తర్వాత శరత్‌మరార్‌తో రాజకీయం మొదలుపెట్టాడు. ఆయనను బినామిగా ఉంచి, తన పనులన్నీ చక్కబెట్టుకున్నాడు. ఇక ఈయన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నుంచి కూడా ఓ సినిమా చేయడం కోసం అడ్వాన్స్ తీసుకున్నాడు. దానిని ఇప్పట్లో తిరిగి ఇచ్చే పరిస్థితిలో పవన్ లేడని అంటున్నారు. అందుకు మద్యేమార్గంగా 'రంగస్థలం' చిత్రం విజయోత్సవ సభకు కేవలం రామ్‌చరణ్‌ని చూసి మాత్రమే పవన్ రాలేదు. మైత్రి మూవీస్‌తో ఉన్న అనుబంధం దృష్ట్యా కూడా దానికి హాజరయ్యాడు.
ఇక ప్రస్తుతం ఆయన మరో నిర్మాతను పాడి అవుగా మార్చుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆయన ఎవరో కాదు 'నేలటిక్కెట్' చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత రామ్ తాళ్లూరి. ఇక పవన్‌పెట్టే జనసేన సభలకు ఆయన ఆర్ధికసాయం చేయడం, పలు మీటింగ్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలకు సైతం ఆయనే పెట్టుబడి పెడుతున్నాడట. ఆ పరిచయంతోనే రవితేజని చూసి కాకుండా ఈ నిర్మాత కోసమే పవన్ 'నేల టిక్కెట్' ఆడియో వేడుకకు హాజరుకానున్నాడని వార్తలు ప్రచారమవుతున్నాయి. కేవలం తన కోరిక మేరకే పవన్ వస్తున్నాడని ఈ నిర్మాత ఆల్‌రెడీ అఫీషియల్‌గానే తెలిపాడు.
ఇక రవితేజకి 'రాజా ది గ్రేట్' వంటి రీఎంట్రీ తర్వాత వచ్చిన 'టచ్ చేసి చూడు' భారీ షాక్‌నే ఇచ్చింది. దాంతో ఇప్పటికే రెండు వరస హిట్లు కొట్టి మొదటి రెండు చిత్రాలైన 'సోగ్గాడే చిన్నినాయనా', 'రారండోయ్ వేడుక చూద్దాం' ద్వారా సత్తా చాటిన కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో రవితేజ, మాళవిక శర్మ జంటగా రానున్న 'నేలటిక్కెట్'తో కళ్యాణ్‌కృష్ణ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ చిత్రం ఆడియోవేడుక ఈనెల 10వ తేదీన హైదరాబాద్‌లోని నెక్లేస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో సాయంత్రం 6గంటలకు జరగనుంది. మరి పవన్ ఈ వేడుకకి వస్తే ఆటోమేట్టిగ్గా మెగా ఫ్యాన్స్ ఈ చిత్రంపై కూడా పాజిటివ్‌గానే రెస్పాన్డ్ అవుతారు. మరి పవన్ రాక ఈ చిత్రానికి ఎంత మేలు చేయనుందో వేచిచూడాల్సివుంది.