Advertisementt

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మధ్య కూడా పెట్టేశారు!

Wed 09th May 2018 01:08 PM
jr ntr,kalyan ram,harikrishna,marriage,naa nuvve audio launch  ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మధ్య కూడా పెట్టేశారు!
Why NTR Didn't Turn up for Naa Nuvve Audio Launch? ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మధ్య కూడా పెట్టేశారు!
Advertisement
Ads by CJ

మెగా ఫ్యామిలీ లుకలుకలు? నందమూరి ఫ్యామిలీలో గొడవలు? ఇలా అనేక రకాల క్యాప్షన్స్ తో అనేక రకాల గాసిప్స్ సోషల్ మీడియా నుండి మీడియా దాకా హల్చల్ చేస్తూనే ఉంటాయి. కొన్ని సార్లు కొందరు స్పందిస్తే.. మరికొందరు మాత్రం కామ్ గా ఉండి డీసెన్సీని మెయింటింగ్ చేస్తారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీపై రూమర్స్ కి ప్రస్తుతం చెక్ పెట్టారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరు, నాగబాబు, అల్లు అర్జున్ ఇలా మేమంతా ఒక్కటే అని నిరూపించుకున్నారు. కానీ ప్రస్తుతం నందమూరి ఫ్యామిలిలో మాత్రం బాలయ్యకి, జూనియర్ ఎన్టీఆర్ కి వార్ నడుస్తూనే ఉంది. నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ, చంద్రబాబు తప్ప ఎన్టీఆర్ అందరితో సఖ్యంగానే ఉంటాడు. కానీ బాలయ్యే బావ కోసం ఎన్టీఆర్ ని దూరం పెట్టాడనే న్యూస్ ఉంది. 

ఇక కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు మాత్రం హరికృష్ణ నీడలో సఖ్యతగానే ఉంటున్నారు. కానీ అప్పుడప్పుడు వారి మధ్యన కూడా గొడవులన్నట్టుగా మీడియా హైలెట్ చేస్తుంది. ప్రస్తుతం అన్న దమ్ములు ఒకరికొకరు అన్నట్టుగానే ఉంటున్నారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ కి కళ్యాణ్ రామ్ కి మధ్యన ఎన్టీఆర్ బయోపిక్ చిచ్చు పెట్టిందని న్యూస్ హైలెట్ అయ్యింది. అందుకే అన్న కళ్యాణ్ రామ్ నా నువ్వే ఆడియో వేడుకకి ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడంటున్నారు. కళ్యాణ్ రామ్ బాబాయ్ బాలయ్య నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్నాడు. కానీ ఎన్టీఆర్ ని బాలయ్య దూరం పెట్టడంతో నేను చెయ్యకుండా ఆ సినిమాలో నువ్వు చెయ్యడమేమిటంటూ కళ్యాణ్ రామ్ ని ఎన్టీఆర్ అడిగినట్లుగా.. అలాగే వారిమధ్యన విభేదాలు మొదలైనట్టుగా కూడా వార్తలు అల్లేశారు.

అలాగే మహేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మూవీ ఈవెంట్ కి రాలేదని.. అయితే కళ్యాణ్ రామ్ మూవీ ఓపెనింగ్ కి వచ్చిన ఎన్టీఆర్... నా నువ్వే ఆడియో కి రాకపోవడం ఫిలింసర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఎన్టీఆర్ రాకపోవడానికి ఒక కారణం ఉందట. అదేమిటంటే హరికృష్ణ ఫ్యామిలీకి కావాల్సిన విశాఖ దేవీ సీఫుడ్స్ ఎండి ఇంట్లో పెళ్ళికి హరికృష్ణ ఫ్యామిలీ నుండి ఎవరో ఒకరు వెళ్లాల్సి  ఉండగా.. కళ్యాణ్ రామ్ నా నువ్వే ఆడియో పెట్టుకోవడం, హరికృష్ణ కి ఆరోగ్యం బాగోకపోవడంతో తప్పనిసరి పరిస్తితుల్లో ఎన్టీఆర్ ఆ పెళ్ళికి వెళ్లాల్సి రావడంతోనే కళ్యాణ్ రామ్ నా నువ్వే ఈవెంట్ కి రాలేకపోయాడట. మరి కేవలం ఆ ఈవెంట్ కి రాకపోవడంతో అన్నదమ్ముల మధ్యన గొడవలనంటూ మీడియాలో వార్తలు హల్చల్ చెయ్యడం వారిని ఎంత బాధించి ఉంటుందో... మరి ఇలాంటి గాసిప్స్ కి ఎవరైనా స్ట్రాంగ్ గా చెక్ పెడితే బావుంటుంది.

Why NTR Didn't Turn up for Naa Nuvve Audio Launch?:

>NTR Misunderstood!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ