కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించిన 'మహానటి' సినిమాని నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. భారీ అంచనాల నడుమ ఈ బుధవారమే 'మహానటి' సినిమా తెలుగు, తమిళ ప్రేక్షకులతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇప్పటికే 'మహానటి' సినిమాపై భారీ క్రేజ్ ఉంది. అందుకు మెయిన్ కీర్తి సురేష్ అచ్చమైన సావిత్రి పోలికలతో ఉండడమే. ఇక మరో కీ రోల్ లో మధురవాణి గా జర్నలిస్ట్ పాత్రలో సమంత నటించింది. అలాగే విజయ దేవరకొండ, సావిత్రి తల్లి పాత్రలో నటి దివ్యవాణి తో పాటుగా.... ఎల్వీ ప్రసాద్ గా అవసరాల శ్రీనివాస్, కేవీ రెడ్డిగా క్రిష్, భానుమతిగా భానుప్రియ నటించడంతో పాటుగా సావిత్రి జీవితంలో అతి ప్రధానమైన పాత్ర జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించాడు . అలాగే విలక్షణ నటుడు ఎస్వీ రంగారావు పాత్రలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు... ఏఎన్నార్ పాత్రలో నాగ చైతన్య కనబడుతున్నాడు.
మరి ఇలా పాత్రల పరిచయాలు హీరో నాని చేతే వీడియో రూపం లో కొత్తగా చేయించిన నాగ్ అశ్విన్ ఇంత పెద్ద స్టార్స్ తో 'మహానటి'ని ఎలా హ్యాండిల్ చేసాడనేదే ఇపుడు హాట్ టాపిక్. ఎందుకంటే నాగ్ అశ్విన్ కి దర్శకుడిగా ఓ... అన్నంత అనుభవం లేదు. మరి ఇంత భారీ స్టార్ కాస్ట్ ని నాగ్ అశ్విన్ ఎలా యూజ్ చేసుకున్నాడు. లేదంటే సినిమాలో నటుల హడావిడి ఎక్కువైపోతోంది. మరి సావిత్రికి రిలేటెడ్ నటీనటులను నాగ్ అశ్విన్ బాగానే సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ ఆ పాత్రల ప్రెజెంటేషన్ లో తేడా కొట్టిందా.. ఇక సినిమా అంతే. ఇక ఎన్టీఆర్ పాత్ర కి ఎవ్వరిని తీసుకోకుండా.. ఏదో డిజిటలైజేషన్ లో ఎన్టీఆర్ ని చూపిస్తారంట.
ఇప్పటికి కట్ చేసిన 'మహానటి' ట్రైలర్ లో మాత్రం అంతా పర్ఫెక్ట్ గానే అనిపిస్తుంది. కానీ సినిమా ఎలా ఉంటుంది... ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది మాత్రం మరొక్క రోజులోనే తేలిపోతుంది. ఎందుకంటే మహానటి సావిత్రి అంటే అలనాటి కాలం ప్రేక్షకులకు ఒక దేవత. ఆమె నిజ జీవితంలో ఎలాంటి కష్టాలు పడిందో వాళ్ళకనవసరం. తమ దేవత వెండి తెర మీద కనబడితే చాలు అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. మరి చూద్దాం నాగ్ అశ్విన్ పనితనం 'మహానటి' విషయంలో ఎలా వుందో. ఇక 'మహానటి' విడుదలైన రెండు రోజులకే పూరి డైరెక్షన్ లో ఆకాష్ హీరోగా నటించిన 'మెహబూబా' కూడా మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందు రాబోతుంది. అలా 'మహానటి' కి 'మెహబూబా' పోటీ ఇచ్చే అవకాశం ఉంది.