బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ఇబ్బందుల్లో పడ్డాడు. ఈ సినిమా నుండి దర్శకుడు తేజ బయటికిపోవడంతో బాలకృష్ణ ప్రస్తుతం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు. ప్రస్తుతానికి ఎన్టీఆర్ సినిమా నిర్మాతగా, హీరోగా చేస్తున్న బాలయ్య తాజాగా దర్శకత్వ బాధ్యతలను కూడా నెత్తినెట్టుకున్నాడనే న్యూస్ హల్చల్ చేస్తుంది. అది కూడా ఆ నలుగురు ఫెమ్ చంద్ర సిద్దార్ధ్ దర్శకత్వ పర్యవేక్షణలో అంటున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడిగా మహానటి డైరెక్షర్ నాగ్ అశ్విన్ పేరు వినబడుతుంది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ అలనాటి మేటి నటి సావిత్రి బయోపిక్ మహానటి సినిమాని తెరకెక్కించాడు. ఆ సినిమా రేపు బుధవారమే ప్రేక్షకులముందుకు రానుంది.
అయితే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సినిమాలో పాత కాలపు సెట్స్, అలాగే సావిత్రి నట జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడని... మహానటి సినిమాని ఎటువంటి వివాదాల జోలికి పోకుండా తెరకెక్కించాడని ఫిలిం నగర్ టాక్. అందుకే బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతలను నాగ్ అశ్విన్ కి అప్పజెప్పితే బావుంటుందనే నిర్ణయానికి రావడమే తరువాయి... నాగ్ అశ్విన్ మామ అశ్విని దత్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నానట్టుగా ఫిలింసర్కిల్స్ లో గుసగుసలు వినబడుతున్నాయి. మరి మహానటి రిజల్ట్ కోసం బాలయ్య వెయిట్ చేస్తున్నాడని... ఆ సినిమా గనక హిట్ అయితే ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతలు నాగ్ అశ్విన్ చేతికి వచ్చేస్తాయని అంటున్నారు.
మరి నిజంగానే నాగ్ అశ్విన్ మహానటి మూవీ హిట్ గనక అయ్యిందా... ఒక్క ఎన్టీఆర్ బయోపిక్ మాత్రమే కాదు మరిన్ని చారిత్రాత్మక చిత్రాలు చేతికొస్తాయి. చూద్దాం ఈ కుర్ర దర్శకుడి అదృష్టం ఎలా వుందో?.