రైటర్ నుండి డైరెక్టర్ గా మారిన వక్కంతం వంశీకి త్రివిక్రమ్ ఫోన్ చేసి మరీ ప్రశంసల జల్లు కురిపించాడట. సాధారణంగా త్రివిక్రమ్ తన సినిమాలు గురించి పెద్దగా మాట్లాడడు. తన సొంత సినిమాలను ప్రమోట్ కూడా చేసుకోడు. కానీ అతనికి ఏదైనా సినిమా నచ్చితే మాత్రం వారికి ఫోన్ చేసి అభినందనలు చెబుతాడు. అలానే వంశీకి ఫోన్ చేసి అభినందించాడు త్రివిక్రమ్.
ఈ విషయాన్ని స్వయంగా వంశీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. త్రివిక్రమ్ తనకు ఫోన్ చేసి.. చాలా నిజాయితీగా ఈ సినిమా తీశావని అభినందించినట్లు చెప్పాడు. కథనే ప్రధానంగా తీసుకుని సినిమా చేశావ్ అని.. కమర్షియల్ హంగులు జోడిస్తూ ఎక్కడ డీవియేట్ కాకుండా సినిమా నడిపించావని త్రివిక్రమ్ ప్రశంసించినట్లు చెప్పాడు. ఒక తొలి చిత్ర దర్శకుడు సినిమా తీసినట్లుగా అనిపించలేదని కూడా త్రివిక్రమ్ అన్నట్లు తెలిపాడు.
అంతేకాకుండా అల్లు అర్జున్ నటన గురించి కూడా పొగడ్తలు గుప్పించినట్లు వంశీ వెల్లడించాడు. త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ నన్ను ఇలా పొగడ్డం గొప్ప అనుభూతినిచ్చిందని అన్నాడు వక్కంతం వంశీ. నాకు ఆయన చాలా ఇన్స్పిరేషన్ చాలాసార్లు చెప్పానని అయన చెప్పాడు. రైటర్స్ నుండి డైరెక్టర్స్ గా మారాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి త్రివిక్రమ్ గారు ఇన్స్పిరేషన్ అని ఆయన తెలిపాడు.