Advertisementt

నాకు తెలుగులో చేయాలనివుంది: అంజలి!

Mon 07th May 2018 04:37 PM
anjali,telugu movies,chances,heroine  నాకు తెలుగులో చేయాలనివుంది: అంజలి!
No offers in telugu, says Anjali నాకు తెలుగులో చేయాలనివుంది: అంజలి!
Advertisement
Ads by CJ

దూరపు కొండలు నునుపు.. పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు.. అనే పెద్దల సామెత హీరోయిన్‌ అంజలి విషయంలో నిజమేనని అర్ధమవుతోంది. ఈ తెలుగు అమ్మాయికి అందం, నటన, టాలెంట్‌ అన్ని ఉన్నా కూడ ఈమెని సీనియర్‌ స్టార్స్‌ సరసనో, లేక లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలకో పరిమితం చేశారు. నిన్నటి దాకా అంజలికి తెలుగులో ఎందుకు అవకాశాలు రావడం లేదు అంటే అందరు ఆమె బొద్దుగా ఉంది. ఆమెకి ఫిట్నెస్‌ లేదని వంకలు పెట్టేవారు కానీ తాజాగా ఆమె నాజూకుగా కూడా తయారైంది. అయినా మన దర్శకనిర్మాతల్లో మార్పు రావడం లేదు. 

దీనిపై అంజలి మాట్లాదడుతూ.. నేను సన్నబడిన తర్వాత తమిళంలో చాలా అవకాశాలు వస్తున్నాయి. కానీ తెలుగు నుంచి మాత్రం నాకు ఆఫర్స్‌ రావడం లేదు. తెలుగు దర్శకనిర్మాతలు నన్ను పట్టించుకోవడం లేదు. అందువల్ల తెలుగులో మంచి అవకాశాలు సాధంచలేకపోతున్నాను. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు కూడా అర్ధం కావడం లేదు. బహుశా తెలుగు దర్శకనిర్మాతలు, హీరోలకు నేనంటే చిన్నచూపేమో. 

నాకు తెలుగులో అవకాశాలు వస్తే మాత్రం నటించడానికి సిద్దంగా ఉన్నాను. నేను కేవలం తమిళంకే పరిమితం కావడం, తెలుగు ఫిల్మ్‌ మేకర్స్‌ ఇలా నన్ను పట్టించుకోవడం లేదు. అంతేగానీ నాకు మాత్రం నా మాతృభాషలో నటించాలని ఎంతో కోరికగా ఉంది అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. మరి తెలుగు మేకర్స్‌ ఈమె మాటలను పట్టించుకుంటారో లేదో చూడాలి.

No offers in telugu, says Anjali:

Anjali about Chances in Tollywood

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ