ఏదైనా పెద్ద సినిమా తెరకెక్కుతుంటే దానిపై రకరకాల రూమర్లు రావడం కామన్. సోషల్ మీడియాలో సినిమాల టైటిల్స్ గురించి చర్చ బాగానే జరుగుతుంది. కొన్నికొన్ని సార్లు సోషల్ మీడియాలో డిస్కస్ చేసుకున్న టైటిల్స్ నే కొన్ని సినిమాలకు పెట్టిన సందర్భాలు ఉన్నాయ్.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న 'తేజ్ ఐ లవ్ యూ' సినిమా టైటిల్ గురించి చర్చ జరిగింది. అలానే బోయపాటి - రామ్ చరణ్ సినిమా ఇంకా సగం షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోకుండానే రెండు మూడు టైటిళ్లు తెరమీదికి వచ్చాయి. కానీ మేకర్స్ మాత్రం ఆ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఇప్పుడు త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు సంబంధించి కూడా ఇలాంటి ఊహాగానాలే వినిపిస్తున్నాయి.
ఈ సినిమాకు సంబంధించి రెండు టైటిల్స్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ‘సింహ నంద’ అనేది ఒక టైటిల్. ‘అసామాన్యుడు’ అనే మరో టైటిల్ పరిశీలనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇందులో ఏ టైటిల్ బాగుంటుందనే దానిపై నందమూరి ఫ్యాన్స్ డిస్కషన్లు మొదలుపెట్టారు. కానీ త్రివిక్రమ్ శైలి ప్రకారం ఈ రెండు టైటిల్స్ పెట్టే ఆలోచనలో లేనట్టు తెలుస్తుంది. ఎందుకంటే త్రివిక్రమ్ ఇటువంటి మాస్ టైటిల్స్ ఎంకరేజ్ చేయడు కాబట్టి. ఇక ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో నడుస్తుందని.. దీనికి ‘కృష్ణార్జున యుద్ధం’ ఫేమ్ పెంచల్ దాస్ రచనా సహకారం అందిస్తున్నాడని.. చిత్తూరు యాసలో సాగే హీరో డైలాగుల కోసం అతను ఎన్టీఆర్‌కు సాయం అందిస్తున్నాడని ఇటీవలే అప్ డేట్ వచ్చింది.