ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోస్ అంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. యంగ్ హీరోస్ అంతా ఒకరికొకరు తోడుగా వుంటున్నట్లుగా ప్రతి విషయంలోనూ అభిమానులకు తెలియచేస్తున్నారు. హీరోస్ అందరూ చాలా ఫ్రెండ్లీగానే ఉంటారు... కానీ అభిమానులు మాత్రం అలా ఉండలేకపోతున్నారు. ఇండస్ట్రీలో మహేష్ - రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్, గోపి చంద్ - ప్రభాస్ ఫ్రెండ్స్, రామ్ చరణ్ - ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి ఫ్రెండ్షిప్స్ ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. మంచు మనోజ్ అయితే అందరి కుర్ర హీరోలతో ఫ్రెండ్లీగా ఉంటాడు. రానా - రామ్ చరణ్, శర్వా - చరణ్ లు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. ఇక ఈ మధ్యన కొత్తగా హీరోగా భార్యలు కూడా ఫ్రెండ్స్ షిప్స్ మొదలెట్టేశారు. మహేష్ బాబు భార్య నమ్రత, చరణ్ భార్య ఉపాసన కూడా చాలా ఫ్రెండ్లీగా వుంటారు. వెకేషన్స్ లో ట్రిప్స్ ని ఎంజాయ్ చేస్తూ దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. నమ్రత - ఉపాసనలు తరుచూ ఏదో ఒక పార్టీలో కలుస్తూనే ఉంటారు.
అయితే స్టార్ హీరోలు వైఫ్ లలో నమ్రత, ఉపాసనలు ఫ్రెండ్స్ గా ఉన్నట్టుగా ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మి ప్రణతి గాని, అల్లు అర్జున్ భార్య స్నేహ గాని ఉండరు. ఎన్టీఆర్ వైఫ్ పెద్దగా పబ్లిక్ లోకి రాదు. అయినా ప్రస్తుతం ప్రణతి ప్రెగ్నెంట్. అయితే ఇప్పుడు చెర్రీ భార్య ఉపాసన.. ఎన్టీఆర్ వైఫ్ తో కూడా జత కట్టేసింది. రామ్ చరణ్ - ఎన్టీఆర్ లు ఎప్పటినుండో ఫ్రెండ్స్. ప్రస్తుతం ఇద్దరు కలిసి రాజమౌళి డైరెక్షన్ లో #RRR లో నటిస్తున్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్ - లక్ష్మి ప్రణతిలు తమ పెళ్లి రోజుని జరుపుకున్నారు. సోషల్ మీడియాలో అభిమానులతో పాటుగా పలువురు ప్రముఖులు ఎన్టీఆర్ జంట కి విషెస్ చెప్పారు. అయితే చరణ్ - ఉపాసన లు మాత్రం ఎన్టీఆర్ - లక్ష్మి ప్రణతి, ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్ లతో కలిసి ఎన్టీఆర్ వెడ్డింగ్ యానివర్సరీని కేక్ కట్ చేసి మరి సెలెబ్రేట్ చేసుకున్నారు. ఆ సందర్భంగా దిగిన ఫొటోలో ఉపాసన ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్ ని ఎత్తుకుని కూర్చుండగా, ప్రణతి... ఉపాసన పక్కనే కూర్చుంది. ఇక ఎన్టీఆర్, చరణ్ లు వారి వెనుకవైపుగా ఒకరిమీద ఒకరు చేతులేసుకుని దిగిన ఆ అద్భుతమైన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.
మరి ఆ పిక్ లో మెగా, నందమూరి హీరోలను భార్యలతో కలిసి చూస్తుంటే... అబ్బ ఇది చాలు... చూడముచ్చటైన ఫ్రెండ్ షిప్ అంటే ఇదే అన్నట్టుగా లేదు. ఇక ఈ ఫోటో ని నందమూరి, మెగా ఫాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. నిజంగా ఆ పిక్ ని చూస్తుంటే మాత్రం ఎవరైనా అబ్బ ఎంత బావుంది అని అనాల్సిందే. గత రాత్రి ఉపాసన ఎన్టీఆర్ - లక్ష్మి ప్రణతికి వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పిక్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.