ఈ ఏడాదిలో విడుదలైన భారీ సినిమాల్లో మార్చ్ ఎండ్ లో విడుదలైన రంగస్థలం, ఆ తర్వాత భరత్ అనే నేను రెండు సినిమాలు బిగ్గెస్ట్ హిట్ అయ్యాయి. ఇక నిన్నగాక మొన్న విడుడుదలైన నా పేరు సూర్య కి ఇంకా లెక్కలు తేలాల్సి ఉంది. అయితే ఈ మూడు సినిమాలు మూడు జోనర్స్ లో తెరకెక్కిన సినిమాలు. అందులో రంగస్థలం సినిమా 1980 లోని పాలిటిక్స్ తో తెరకెక్కితే... భరత్ అనే నేను ప్రస్తుతం రాజకీయాలతో తెరకెక్కింది. అలాగే నా పేరు సూర్య కూడా దేశభక్తి తో ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కింది. అయితే ఈ సినిమాల్లో కామన్ పాయింట్ ఏమిటంటే ఈ మూడు సినిమాల్లోని ముగ్గురు హీరోల పెరఫార్మెన్స్.
రంగస్థలం లో చిట్టిబాబుగా రామ్ చరణ్ అదరగొట్టే పెరఫార్మెన్స్ చూపించాడు. అలాగే భరత్ అనే నేను లో కూడా మహేష్ యంగ్ సీఎం గా స్టైలిష్ గా ఇరగదీసాడు. ఇక నా పేరు సూర్య లో కోపాన్ని అణుచుకోలేని ఆర్మీ జవాన్ గా సినిమాని ఒంటి చేత్తో నడిపించాడు అల్లు అర్జున్. అసలు ముగ్గురు హీరోలలో తమ నటనతో అభిమానులనే కాదు, ప్రేక్షకులను కట్టిపడేసారు. మరి చిట్టిబాబు, భరత్, సూర్య లలో ఎవరు గొప్ప అనే ప్రశ్న కూడా ఆటోమాటిక్ గా సోషల్ మీడియా లో రైజ్ అయ్యింది. మూడు సినిమాల్లో ముగ్గురు నటుల్లో ఎవరి నటన గొప్పగా వుంది అంటే... చెప్పడం కష్టమైన పనే... కానీ చెప్పాలి.
మరి అందరిలో చిట్టిబాబు పాత్రలో మెరిసిన చరణ్ కే ఎక్కువ మార్కులు పడుతున్నాయి సాంఘీక మాధ్యమాల్లో. ఎలా అంటే రంగస్థలంలో చిట్టిబాబు మాంచి బాడీతో లుంగీ, చొక్కాతో అలనాటి స్మృతులను గుర్తుకు తేవడమే కాదు.. చిట్టిబాబు అనే ఊర మాస్ పాత్రలో కరెక్ట్ గా సెట్ అవడమే కాదు... నటనలోనూ అదరగొట్టేసాడు. మరి చరణ్ కెరీర్ లోనే అలాంటి పల్లెటూరి గెటప్ చేయకపోవడమే కాదు. ఇంతవరకు పల్లెటూళ్లలో చరణ్ గడిపింది లేదు. అలాంటప్పుడు చరణ్ చిట్టిబాబుగా రంగస్థలంలో దున్నేశాడు. రంగస్థలం హిట్ లో చరణ్ కే ఎక్కువ మార్కులు దక్కాయి. ఇక మహేష్ కూడా సీఎం గా కొత్త పాత్రే చేసాడు. కానీ అలాంటి సీరియస్ నెస్ పాత్రలు ఎవరైనా చేయగలరనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
నా పేరు సూర్య లో అల్లు అర్జున్ పాత్ర కూడా సీరియస్ నిండిన పాత్రే. అలాంటి ఆర్మీ జవాన్ పాత్రలు కూడా అందరూ పండించగలరు. మరి ఈ ముగ్గురు హీరోల్లో ఎవరు బెస్ట్ అనే విషయంలో చిట్టిబాబుగా చరణ్ మాత్రం ఒక మెట్టు పైనే ఉన్నాడు. మరి కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ అందుకోవడమే కాదు... నటుడిగాను రామ్ చరణ్ రంగస్థలంతో ఎన్నో మెట్లెక్కాడు.