నందమూరి బాలకృష్ణ తనకు ఉన్న అత్యంత ఉన్నతమైన స్నేహితులో మెగాస్టార్ చిరంజీవి పేరు చెబుతాడు. ఇక నాగార్జునకి, చిరంజీవికి ఉన్న స్నేహం అందరికీ తెలిసిందే. వెంకటేష్ అయితే పవన్, మహేష్ వంటి వారిని సొంత తమ్ముళ్లుగా భావించే అజాత శత్రువు. నేటితరంలో పవన్‌కళ్యాణ్ ఇటీవల ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల షూటింగ్ ప్రారంభోత్సవానికి వెళ్లి క్లాప్‌కొట్టాడు. మహేష్ నాడు వెకేషన్స్‌లో ఉన్నప్పుడు అక్కడ చరణ్ ప్రత్యక్షమయ్యాడు. మహేష్ 'భరత్ అనే నేను' ప్రీరిలీజ్ ఈవెంట్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరయ్యాడు. ఆవెంటనే ఎన్టీఆర్, మహేష్, రామ్‌చరణ్‌లు కలిసి ఓ ఫోటోలో దర్శనమిచ్చారు. 'రంగస్థలం' చిత్రాన్ని అందరు స్టార్స్ మెచ్చుకున్నారు. ఇక 'భరత్ అనే నేను' విషయంలో కూడా స్టార్స్ అందరు కలిసి మహేష్‌కి విషెష్ తెలిపారు. ఈ కోవలోకి ఇంకా అల్లుఅర్జున్ రాకపోవడం ఒక్కటే విశేషం.
ఇక తాజాగా ఎన్టీఆర్, లక్ష్మీప్రణతిల వెడ్డింగ్ యానివర్శరీని రామ్‌చరణ్, ఉపాసన సెలబ్రేట్ చేస్తున్న ఫొటో చూస్తే వారి అభిమానులకు కనుల పండగగా ఉంది. ఇక ఉపానన ఒడిలో ఎన్టీఆర్ బుజ్జోడు కూర్చుని ఉన్నాడు. ఇలా నిజజీవితంలోనే కాదు.. సినిమాల విడుదలలో కూడా మన స్టార్స్ ఒకరి చిత్రానికి తమ చిత్రానికి గ్యాప్ తక్కువ కాకుండా రెండు వారాల గ్యాప్‌ని మెయిన్‌టెయిన్ చేస్తూ తమ బాండింగ్‌ని చూపిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కుమారుడు ఉపాసన ఒడిలో ఉంటే, ఎన్టీఆర్ భుజం మీద చరణ్ చేయి వేసి ఉన్నాడు.
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ చిత్రం బిజీలో ఉండగా, రామ్‌చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు. త్వరలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు కలసి రాజమౌళి తీయబోయే మల్టీస్టారర్‌లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అక్టోబర్ నుంచి పట్టాలెక్కనుందని సమాచారం. ఇక ఈ మూవీ స్టార్ట్ అయ్యేలోపే ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల సాన్నిహిత్యం బాగా పెరుగుతోంది. ఇక సినిమా విడుదలైన తర్వాత వారి అభిమానులు కూడా అలాగే సఖ్యతతో నడుచుకుంటారో లేదో చూడాల్సివుంది.