సినిమా రంగంలో లవ్‌లు, లివింగ్ రిలేషన్‌షిప్‌లు ఉంటాయని సినీనటి, నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన హీరోయిన్లు ప్రేమలో పడటం సహజమేనని రోజా వ్యాఖ్యానించారు. తన జీవితంలో అన్ని అనుకోకుండానే జరిగిపోయానని, అనుకోకుండానే హీరోయిన్‌ని అయ్యానని, అలాగే అనుకోకుండా రాజకీయాలలోకి వచ్చి ఎమ్మెల్యేని అయ్యానని ఆమె తెలిపింది. ఇంకా ఆమె మాట్లాడుతూ.. చదువుకునే రోజుల్లో నేను చిరంజీవి, నాగార్జునలకు ఫ్యాన్‌ని. చిరంజీవితో కలిసి మూడు చిత్రాలలో నటించాను. ఆయన నాకు బాస్. రాజకీయాలలో విమర్శలు చేయడం సహజమే. రాజకీయాలకు చిరంజీవి పనికిరాడు అని నేను అన్నప్పుడు చిరంజీవి కూడా బాధపడే ఉంటారని రోజా తెలిపారు.
వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిలపై సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్స్ చేశారని, ఆమెకి తన ఎత్తు ఎదిగిన పిల్లలు ఉన్నారని, ఆమె కుటుంబం బాధపడేలా టిడిపి వారు దారుణమైన ప్రచారం చేశారు. చంద్రబాబు తన అవసరాల కోసం ఏమైనా చేస్తారు. బాలకృష్ణ, హరికృష్ణలని వాడుకుని వదిలేశాడు. మరలా బాలయ్య కూతురిని తన కుమారుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్‌కి కూడా తన బంధువు కూతురితోనే వివాహం జరిపించాడు.. అని ఆమె అన్నారు.
పవన్ కళ్యాణ్ టాప్ హీరోలలో ఒకరు. అయితే రాజకీయాలలో నెగ్గి ఆయన అధికారంలోకి వస్తాడని నేను భావించడంలేదు. అయితే రాజకీయాలను మాత్రం ఆయన ప్రభావితం చేయగలడని నమ్ముతున్నాను అంటూ పవన్ విషయంలో రోజా కాస్త సాఫ్ట్‌కార్న్ ప్రదర్శించింది. బాలకృష్ణ కూడా సినిమాలలో నెంబర్‌వనే. కానీ ఆయన వంటి వారిని వదిలేసి పవన్ విషయయంలో మాత్రం ఆయన్నేటార్గెట్ చేయడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. మొత్తానికి పవన్ విషయంలో వైసీపీస్టాండ్ మారినట్లు రోజా మాటలు వింటుంటేనే అర్ధమవుతోంది.