తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులు చేత ప్రశంసలు పొందాడు డైరెక్టర్ చందు మొండేటి. మొదటి సినిమా 'కార్తికేయ' తో సత్తా చాటి రెండో సినిమా 'ప్రేమమ్' తో ఆయనలో కొత్తకోణంని ఆవిష్కరించాడు చందు. ఇప్పుడు అతను నాగ చైతన్యతో 'సవ్యసాచి' సినిమా రూపొందిస్తున్నాడు.
నాగ చైతన్యకి జోడిగా నిధి అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమాను జూన్ 14న విడుదల చేయాలనీ మేకర్స్ అనుకున్నారు. కానీ ఆ రోజు ఈ సినిమా వచ్చే ఛాన్స్ లు చాలా తక్కువగా ఉన్నట్టు తాజా సమాచారం. సరైన సమాచారం అయితే తెలియదు కానీ.. జూన్ 14న విడుదల అవ్వడం కష్టమే అని నిర్మాతలు చెబుతున్నట్టు సమాచారం.
'ప్రేమమ్' తర్వాత నాగ చైతన్య - చందు మొండేటి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కాబట్టి ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి . విలక్షణ నటుడు మాధవన్ ఈ సినిమాలో చైతుకి విలన్ గా నటిస్తున్నాడనే సంగతి తెలిసిందే. ఇక భూమిక చైతుకి అక్కగా కనిపించనుంది.