Advertisementt

ఎన్టీఆర్‌ కథ అలాగే ఉంది: వక్కంతం వంశీ!

Sun 06th May 2018 04:06 PM
jr ntr,vakkantham vamsi,naa peru surya naa illu india,allu arjun  ఎన్టీఆర్‌ కథ అలాగే ఉంది: వక్కంతం వంశీ!
Vakkantam Vamsi rubbishes rumours on NTR ఎన్టీఆర్‌ కథ అలాగే ఉంది: వక్కంతం వంశీ!
Advertisement
Ads by CJ

ఈటీవీలో న్యూస్‌రీడర్‌గా పనిచేసి, తర్వాత 'కళ్యాణ ప్రాప్తిరస్తు' అనే చిత్రం ద్వారా హీరోగా దాసరి దర్శకత్వంలో సుమ హీరోయిన్‌గా సినిమా నటునిగా అవతారం ఎత్తాడు వక్కంతం వంశీ. ఇక ఆ తర్వాత ఆయన రచయిత అవతారం ఎత్తి, పలు హిట్‌ చిత్రాలకు కథ, మాటలు వంటివి అందించి స్టార్‌ రైటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈయన నాలుగేళ్లుగా పలువురు రచయితలైన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, కొరటాలశివ వంటి వారి తరహాలో డైరెక్టర్‌గా మారాలని నిర్ణయించుకున్నాడు. రెండేళ్ల కిందట వక్కంతం వంశీకి ఎన్టీఆర్‌ డైరెక్టర్‌గా చాన్స్‌ ఇస్తానని అఫీషియల్‌గా కూడా ప్రకటించాడు. కానీ ఎన్టీఆర్‌ ఎంత కాలానికి తన చిత్రం మొదలుపెట్టకపోవడంతో ఆయన బన్నీని కలిసి ఎన్టీఆర్‌కి చెప్పిన స్టోరీతోనే 'నాపేరు సూర్య..నాఇల్లు ఇండియా' చిత్రం చేశాడని పలువురు భావించారు.

అయితే దీనిపై వక్కంతం వంశీ తాజాగా స్పందించాడు. తాను ఎన్టీఆర్‌కి చెప్పిన స్టోరీ వేరని, కానీ అల్లుఅర్జున్‌తో చేసిన 'నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా' చిత్రం కథవేరని, నల్లమలుపు బుజ్జి.. అల్లుఅర్జున్‌ కోసం కథను అడగగానే తానే తన స్టోరీ బ్యాంకులో ఉన్న 'నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా' కథను బయటికి తీశానని చెప్పుకొచ్చాడు. తన తెరంగేట్రానికి, బన్నీకి ఈ కథ ఖచ్చితంగా సరిపోతుందని భావించి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా మారాను. 

ఇక ఎన్టీఆర్‌తో చేయాల్సినకథ అలాగే ఉంది. ఆ కథ పర్‌ఫెక్ట్‌గా రాకపోవడంతో దానిపై మరింత దృష్టి పెడతాను. ఈ కథను కేవలం ఎన్టీఆర్‌తోనే చేస్తాను. ఎన్టీఆర్ తో ఎటువంటి విభేదాలు లేవని వక్కంతం వంశీ చెప్పుకొచ్చాడు. ఇక 'నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా' చిత్రంకి మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్స్ మాత్రం హై రేంజ్ లో వున్నాయి. 

Vakkantam Vamsi rubbishes rumours on NTR:

>No Differences With NTR, Says Vakkantham Vami

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ