Advertisement

త్రివిక్రమ్, ఎన్టీఆర్- కృష్ణార్జున యుద్ధం టచ్!

Sun 06th May 2018 03:12 PM
jr ntr,trivikram srinivas,penchal das,folk song,krishnarjuna yuddham  త్రివిక్రమ్, ఎన్టీఆర్- కృష్ణార్జున యుద్ధం టచ్!
Trivikram ropes a folk singer Penchal Das for his Next NTR28 త్రివిక్రమ్, ఎన్టీఆర్- కృష్ణార్జున యుద్ధం టచ్!
Advertisement

అజ్ఞాతవాసి డిజాస్టర్ నుండి బయటికి వచ్చిన త్రివిక్రమ్.. ఎన్టీఆర్ తో కలిసి కొత్త సినిమా షూటింగ్ మొదలు పెట్టేశాడు. విరామం లేకుండా ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా షూటింగ్ నడుస్తుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మొత్తం ఫ్యామిలీ కథగా వుండబోతుందనే ప్రచారం ఉంది. అయితే నిర్విరామంగా సాగుతున్న ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ల సినిమా అప్పుడే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని సెకండ్ షెడ్యూల్ కోసం సిద్ధమవుతుంది. అయితే ఈ సినిమా మొత్తం  రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో కొనసాగుతుండడంతో ఈ సినిమాలో డైలాగ్స్ కూడా రాయలసీమ యాసలోనే వుండేట్లుగా తివిక్రమ్ ప్లాన్ చేసాడట.

ఇక ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ కూడా రాయలసీమ యాసలోనే ఉంటాయనే టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో ఒక ఫోక్ సాంగ్ కూడా రాయలసీమ యాసలోనే సాగుతుందట. అయితే ఈ పాటను కృష్ణార్జున యుద్ధంలో 'దారి చూడు .. దమ్ముచూడు' అనే పాటని ఆలపించిన పెంచల్ దాస్ తో పాడించనున్నట్టుగా సమాచారం. ఇక కృష్ణార్జున యుద్ధం సినిమా కోసం ఆయన పాడిన 'దారి చూడు .. దమ్ముచూడు'  పాట ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెల్సిందే. ఇక ఇలాంటి ఊరమాస్ సాంగ్ కి ఎన్టీఆర్ ఊర మాస్ స్టెప్స్ కూడా తోడైతే... ఉంటుంది నా సామిరంగా.. చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఇక ఎన్టీఆర్ రాయలసీమ భాషలో ఎలా మాట్లాడుతాడో అనేది ఇప్పుడు ఫ్యాన్స్ లో తెగ ఇంట్రెస్టింగ్ గా మారింది.

మరి కృష్ణార్జున యుద్ధంలో నాని రాయలసీమ యాసలో అద్భుతమైన నటన ప్రదర్శించాడు. మరి ఈలెక్కన ఎన్టీఆర్ కూడా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రాయలసీమ యాసలో ఇరగదీస్తాడంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఇక డీజే భామ పూజ హెగ్డే తో ఎన్టీఆర్ ఈ సినిమాలో జంటగా నటించబోతున్నాడు. 

Trivikram ropes a folk singer Penchal Das for his Next NTR28 :

Krishnarjuna Yuddham Touch to NTR28

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement